Hyderabad to Ayodhya Flight Service:  అయోధ్యలో కొలువైన భవ్యమైన రామ మందిరం నిర్మాణ  కల దాదాపు 4 శతాబ్దాల తర్వాత నెరవేరింది.  అయోధ్యలో రాముడు జన్మస్థలంలో ఆలయ నిర్మాణం కోసం ఆ దేవదేవుడే 400 యేళ్ల వవవాసం చేసాడని చెప్పాలి. ఈ యేడాది జనవరి 22వ తేదిన అయోధ్యలో బాల రాముడిగా కొలవు తీరాడు. ఆ దేవ దేవుడి దర్శనం కోసం దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి బాల రాముణ్ణి  దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల డిమాండ్ కు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు.. భాగ్య నగరం  నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్ ప్రాంతాలకు విమాన సర్వీసులు ఈ నెల 27న   ప్రారంభం అయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్ కాన్పూర్ మధ్యలో , హైదరాబాద్ నుంచి ప్రభు బాల రాముడు కొలువుదీరిన అయోధ్య మధ్యన వారానికి 4 రోజుల సర్వీసు ప్రారంభమైంది. అటు సెప్టెంబర్ 28 నుంచి  హైదరాబాద్ - ప్రయాగరాజ్ మధ్యన మరో ఫ్లైట్ అందుబాటులోకి వచ్చింది.  హైదరాబాద్ - ఆగ్రా మధ్య వారానికి 3 రోజుల సర్వీసును ప్రారంభించారు. .


హైదరాబాద్ నగరం నుంచి  ఒక్క నెలలోనే 7 కొత్త విమాన సర్వీసుల ప్రారంభించారు.  ఈ విమాన సర్వీసుల ప్రారంభం చేయడాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖా మంత్రి కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కొత్త సర్వీసులు ఆయా నగరాల మధ్యన ప్రయాణికుల డిమాండ్ ను నెరవేరుస్తాయన్నారు. ఈ కొత్త సర్వీసులను హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల ప్రజలు  సద్వినియోగం చేసుకోవాలని కిషన్ రెడ్డి ప్రయాణికులను అభ్యర్ధించారు.  మొత్తంగా ఇప్పటి వరకు రైలు ప్రయాణంతో పాటు వారణాసీకి ఫ్లైట్ ప్రయాణం చేసిన తర్వాత అయోధ్యకు భక్తులు వివిధ మార్గాల ద్వారా అయోధ్యకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భాగ్య నగరం నుంచి నేరుగా కొత్త విమాన సర్వీసులు ప్రారంభించడంతో ఆ దేవదేవుని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  మొత్తంగా అయోధ్యకు వెళ్ల ప్రయాణికులు దారి మధ్యలో వారణాసితో పాటు చుట్టు పక్కల చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ప్రాంతాలను దర్శించుకొని ఇంటికి చేరుకోవచ్చు.


ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!


ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.