Viral Video: ఢిల్లీలో షాకింగ్ ఘటన.. పట్టాలు తప్పిన రైలు.. 8 బోగీలు బోల్తా.. వైరల్ గా మారిన ఘటన..
Delhi: ఢిల్లీలోని జఖీరా ఫ్లైఓవర్ సమీపంలో శనివారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గూడ్స్ రైలుకు చెందిన ఎనిమిది బోగీలు ఒక్కసారిగా పట్టాలు తప్పాయి. దీంతో గూడ్స్ రైలు డబ్బాలన్ని ఒకవైపుగా వాలిపోయాయి. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Goods Train Derail In Delhi Zakhira: మనలో చాలా మంది రైళ్లలో ప్రయాణించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా లాంగ్ జర్నీలు చేసే వారు తప్పకుండా ట్రైన్ జర్నీకే ప్రయారిటీ ఇస్తారు. రైళ్లో వచ్చే తినుబండారాలు తింటూ, ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తూ జర్నీ చేస్తారు. కానీ కొన్నిసార్లు రైలు ప్రయాణంలో ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. రైళ్లు పట్టాల తప్పడం, రైళ్లలో పేలుళ్లు వంటివి జరుగుతుంటాయి.
ఇలాంటి క్రమంగా ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంది. కొన్నిసార్లు రైళ్లలో టెక్నికల్ సమస్యలు, సిగ్నలంగ్ లో సమస్యలు తలెత్తుతుంటాయి. కొన్నిసార్లు రైల్వే పట్టాలలో ఏదైన సమస్యలున్న కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే.. ఢిల్లీలో గూడ్స్ రైలు ఒక్కసారిగా పక్కకు పడిపోయింది. దాదాపు 8 గూడ్స్ రైలు డబ్బాలు ఒకవైపు వంగిపోయిన ఘటన వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు..
దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జఖీరా ఫ్లైఓవర్ సమీపంలో గూడ్స్ రైలుకు చెందిన ఎనిమిది బోగీలు ఇనుప షీట్లతో పట్టాలు తప్పాయి. దాదాపు 8 బోగీ డబ్బాలు ఒకవైపుకు పూర్తిగా పడిపోయాయి. ఘటనపై సమాచారం అందగానే రైల్వే అధికారులు, టెక్నికల్ టీమ్ అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రదేశంలో సహయక చర్యలను ముమ్మరం చేశారు.
గూడ్స్ లో ఎవరైన చిక్కుకున్నారా..?.. ప్రాణనష్టం ఏదైన జరిగిందా.. ? అన్న కోణంలో రైల్వే అధికారులు సహయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో గూడ్స్ రైలులో ఇనుప రేకులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.
Read More: Iswarya Menon: ఎరుపెక్కిన అందాలతో హీటెక్కిస్తున్న ఐశ్వర్య మీనన్, లేటెస్ట్ పిక్స్ వైరల్
రైలు పట్టాలపై ఉన్నగూడ్స్ బోగీలను పక్కకు తీసుకెళ్లే పనులు చేస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని రైళ్ల రాకపోకలకు అడ్డంకిగా మారింది. ఆ ప్రాంతం మీదుగా వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో గూడ్స్ భోగీలు కింద పడ్డ ఘటన వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook