Jobs Recruitment 2022: దేశంలో అతి ప్రధానమైన సమస్య నిరుద్యోగం. కేవలం పది, పన్నెండు తరగతుల విద్యార్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం. ఆ వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పదవ తరగతి నుంచి గ్యాడ్యుయేషన్ వరకూ..చదివింది ఎంతైనా నిరుద్యోగం మాత్రం తప్పడం లేదు. ప్రతి ఒక్కరూ ఉద్యోగాల వేటలో ఉంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల గురించి..గడువు తేదీ వంటి కీలకమైన వివరాలు తెలుసుకుందాం. ఐటీబీపీ, యూసీఐఎల్ వంటి విభాగాల్లో ఉద్యోగాలున్నాయి. 


ఐటీబీపీ రిక్రూట్‌మెంట్


దేశంలోని భద్రతా విభాగాల్లో ఉద్యోగాల కోసం ఏదైనా గుర్తింపుపొందిన బోర్డ్ లేదా విద్యాలయం నుంచి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇండియా టిబెట్ బోర్డర్ పోలీస్ విభాగంలో 2 వందల కంటే ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. దీనికోసం అర్హులైన అభ్యర్ధులు 2022 జనవరి 1 వరకూ కనీసం 18 ఏళ్లు, అధికంగా 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఐటీబీపీ ఉద్యోగాల భర్తీ కోసం అభ్యర్ధుల్ని ప్రవేశ పరీక్ష, పీఎస్టీ, లిఖిత పరీక్ష, స్కిల్‌టెస్ట్, డాక్యుమెంట్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు.  భారత్ టిబెట్ బోర్డర్ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2022 లో మొత్తం ఖాళీల సంఖ్య 248. ఎంపికైన అభ్యర్ధుల్ని హెడ్ కానిస్టేబుల్స్‌గా నియమిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. చివరి తేదీ జూలై 7వ తేదీగా ఉంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు recruitment.itbpolice.nic.in వెబ్‌సైట్ సందర్సించాల్సి ఉంటుంది. 


యూసీఐఎల్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2022


భారత ప్రభుత్వం ఆధీనంలో ఉన్న కంపెనీలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్  విభిన్న ప్రభుత్వ సంస్థల్లో అప్రెంటిస్ పదవుల్ని భర్తీ చేస్తోంది. ఇందులో మైనింగ్ మేట్ పోస్ట్ కోసం ఇంటర్మీడియట్ కనీస అర్హతగా ఉంది. అటు బ్లాస్టర్ పోస్ట్ కోసం అభ్యర్ధ కనీసం పదవ తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి. అటు వైండింగ్ ఇంజన్ డ్రైవర్ పోస్ట్ కోసం కూడా పదవ తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి. యూసీఐఎల్ అప్రెంటిస్ 2022 లో అభ్యర్ధుల్ని ఆబ్జెక్టివ్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. యూసీఐఎల్ రిక్రూట్‌మెంట్ కోసం ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇందులో మొత్తం 130 పోస్టులు ఖాళీలున్నాయి.


Also read: Southwest Monsoon: దేశంలో విస్తరిస్తున్న నైరుతి రుతు పవనాలు..త్వరలో భారీ వర్షాలు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి