ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రక్తదానం చేస్తే వేతనంతో కూడిన సెలవు తీసుకోవచ్చని సిబ్బంది వ్యవహార మంత్రిత్వశాఖ తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్రం ఇప్పటివరకు పూర్తిస్థాయిలో రక్తదానం చేసిన వారికి మాత్రమే వేతనంతో కూడిన సెలవును మంజూరు చేస్తోంది. అఫెరెసిస్ విధానంలో రక్తదానం చేసిన వారికి సెలవు మంజూరు చేయడం లేదు. తాజాగా అఫెరెసిస్ విధానంలో రక్తదానం చేసిన వారికి కూడా వేతనంతో కూడిన సెలవును ఇవ్వాలని నిర్ణయించారు. 


"పూర్తిసాయిలో, అఫెరెసిస్ విధానంలో రక్తదానం చేసినవారికి స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని నిర్ణయించాం. అయితే లైసెన్స్ ఉన్న బ్లడ్ బ్యాంకుల్లో రక్తదానం చేసినవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. సంబంధిత రక్తదాన పత్రాలను చూపించి.. ఉద్యోగి గరిష్టంగా సంవత్సరానికి నాలుగు పనిదినాలు సెలవు తీసుకోవచ్చు" అని  ఉత్తర్వుల్లో పేర్కొంది.