మొబైల్ లో నెట్  స్పీడ్  తక్కువగా ఉంది అని బాధపడుతున్నారా ? ఇదేం బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ రా బాబోయ్ .. అని అనుకుంటున్నారా ? ఇకపై ఆలా అనరులేండి. ఎందుకంటే 512కేబీపీస్ స్పీడ్ ఉన్న మన ఇంటర్నెట్ సేవలను ఇకపై నాలుగింతలు రెట్టింపు చేసి 2ఎంబీపీఎస్ కు అందిస్తున్నట్లు భారత టెలికాం వర్గాలు పేర్కొన్నారు.  ఇది అమలైతే  భారతదేశంలో స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న 30 కోట్ల మందికి పైగా ప్రజలకు లబ్ది చేకూరనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ విషయమై టెలికాం కార్యదర్శి సుందరరాజన్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి- మనం ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో చాలా నెమ్మదిగా ఉన్నాము. భారత ఆర్ధికవ్యవస్థ డిజిటల్ వైపు పరుగులు పెడుతోంది. అందుకోసం వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు తప్పనిసరి. 


3జీ, 4జీ పోయి 5జీ వస్తున్నా.. ఇంకా 2ఎంబిపీఎస్ స్పీడేనా? అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. ప్రస్తుతమున్న మౌలిక వసతుల కొరత దృష్ట్యా 2ఎంబిపీఎస్ వరకు మాత్రమే వేగం పెంచగలము. భవిష్యత్తులో ఈ స్పీడ్ మరింత పెరుగుతుందని అన్నారు. 


ఇంటర్నేషనల్  టెలికమ్మ్యునికేషన్ యూనియన్ (ఐటియు) 5జీ స్పీడ్ 20జిబీపీఎస్ గా నిర్ధారించింది. దక్షిణ కొరియా ప్రపంచములోనే వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ కలిగి ఉంది. ఆసియా ఖండం మొత్తం మీద భారతదేశంలోనే అతితక్కువ ఇంటర్నెట్ స్పీడ్ ఉంది. మన దేశంలో 3జీ మొబైల్ యూజర్లకు10కేబిపిఎస్ స్పీడ్ మాత్రమే వస్తోంది.