YouTube channels Ban: 35 పాకిస్థాన్ యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం వేటు- కారణాలివే..
YouTube channels Ban: భారత్‌పై విష ప్రచారం చేస్తున్న పాక్ యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం చర్యలు ప్రారంభించింది. పలు సోషల్ మీడియా అకౌంట్లనూ బ్యాన్ చేసింది.
YouTube channels Ban: నకిలీ సమాచారంతో భారత్‌పై తప్పుడు ప్రచారాలు చేస్తున్న పాకిస్థానీ యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం కొరడా ఝులిపించింది. మొత్తం 35 పాకిస్థానీ యూట్యూబ్ ఛానెళ్లపై వేటు వేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ (ఐ అండ్ బీ) (Pakistan YouTube Channels Ban) వెల్లడించింది.
ఇదే కారణాలతో.. పాకిస్థాన్ నుంచి అపరేట్ చేస్తున్న.. రెండు వెబ్సైట్లు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, రెండు ట్విట్టర్ అకౌంట్లు, ఓ ఫేస్బుక్ అకౌంట్ పైనా బ్యాన్ (anti-India propaganda) విధించింది.
గత ఏడాది డిసెంబర్లో కూడా 'యాంటీ ఇండియా' కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్నాయనే కారణంతో 20 యూట్యూ బ్ ఛానెళ్లను బ్యాన్ చేసింది (Ban on anti India Youtube Channels) ప్రభుత్వం.
ఇక తాజా యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియా అకౌంట్లపై బ్యాన్ అంశంపై ఐ అండ్ బీ కార్యదర్శి అపూర్వ చంద్ర పలు కీలక విషయాలు (Information and Broadcast ministry) వెల్లడించారు.
ఆయా యూట్యూబ్ ఛానెళ్లలన్నీ పోస్ట్ చేసిన కంటెంట్‌కు దాదాపు 130 కోట్ల వ్యూస్ ఉన్నట్లు తెలిపారు. ఆయా ఛానెళ్లకు 1.2 కోట్ల సబ్స్క్రైబర్లు ఉన్నారని పేర్కొన్నారు. బ్యాన్ చేసిన యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లు అన్ని పాకిస్థాన్ కేంద్రంగానే నడుస్తున్నట్లు ఇంటెలీజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్నట్లు వివరించారు. ఆ సమాచారం ఆధారంగానే చర్యలకు ఉపక్రమించినట్లు పేర్కొన్నారు.
ఆయా ఛానెళ్లలో ఎలాంటి కెంటెంట్ ఉందంటే..
బ్యాన్‌కు గురైన ఛానెళ్లలో ఖబర్ విత్ ఫ్యాక్ట్స్, గ్లోబల్ ట్రూత్, ఇన్ఫర్మేషన్ హబ్, అప్నీ దునియా టీవీ, ఖోజీ టీవీ వంటివి ముఖ్యమైనవిగా పేర్కొంది ఐ అండ్ బీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 69-ఏ ఆధారంగానే వాటిని బ్యాన్ చేసినట్లు (Youtube channels blocked in india) స్పష్టం చేసింది.
ఆయా ఛానెళ్లలో.. గత ఏడాది డిసెంబర్లో హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ (Fake news on Gen Bipin Rawat), జమ్ము కశ్మీర్ సహా వివిధ సున్నితమైన అంశాలపై (Fake news on Jammu Kashmir) తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు వివరించింది ఐ అండ్ బీ.
Also read: Netaji grand statue : ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం, ప్రధాని మోదీ వెల్లడి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook