Rahul Gandhi attacked the government on the way the farm laws have been repealed: కాంగ్రెస్​ కీలక నేత రాహుల్​ గాంధీ పార్లమెంట్​లో అధికార పక్షం తీరుపై మండిపడ్డారు. సోమవారం ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పాల్గొన్న రాహుల్​ గాంధీ సెషన్​ అనంతరం మీడియాతో (Rahul Gandhi on Parliament winter session) మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చర్చలకు భయపడుతున్నారు..


ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్​డీఏ ప్రభుత్వం చర్చలను తప్పించుకునే ప్రయత్నం చేస్తోందంటూ విమర్శించారు. పార్లమెంట్​లో ఉభయ సభల్లో సాగు చట్టాల రద్దు బిల్లుకు అమోదం తెలిపిన తీరును ఉద్దేశిస్తూ (Rahul Gandhi on Farm Laws Repeal Bill 2021) ఈ విధంగా స్పందించారు రాహుల్​ గాంధీ.


"సాగు చట్టాల రద్దు బిల్లుకు ఆమోదం తెలిపిన తీరు చూస్తే.. ప్రభుత్వం చర్చలంటే భయపడుతోందని అర్థమవుతోంది" అని రాహుల్​ గాంధీ పేర్కొన్నారు.


నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు చేపట్టిన నిరసనలతో ఇటీవల కేంద్రం దిగొచ్చి.. నూతన సాగు చట్టాల రద్దు బిల్లు 2021ను (New Farms laws) తీసుకొచ్చింది. దీనికి పార్లమెంట్ ఉభయ సభలు నేడు ఆమోదం తెలపడాన్ని రైతుల విజయంగా అభివర్ణించారు రాహుల్​. ఇది దేశం సాధించిన విజయమని పేర్కొన్నారు.


ఈ బిల్లుకు సంబంధించి.. నిరసనల్లో పాల్గొన్న రైతుల మరణాలు, యూపీలోని లఖింపూర్​ ఖేరీ (Lakhimpur kheri violence) ఘటనలపై చర్చించాలని భావించినట్లు రాహుల్ వెల్లడించారు. అయితే అందుకు అవకాశం దక్కలేదని పేర్కొన్నారు.


సాగు చట్టాల రద్దు బిల్లు ఆమోదం ఇలా..


వివాదాస్పదంగా మారిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి సాగు చట్టాల రద్దు బిల్లు 2021ను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్​ నేడు పార్లమెంట్ ముందుకు తెచ్చారు.


లోక్ సభలో ఈ బిల్లుపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టగా అందుకు స్పీకర్ ఓం బిర్లా అంగీకరించలేదు. దీనితో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ ఆందోళనల మధ్యే.. మూజువాణి ఓటు ద్వారా బిల్లుకు ఆమోద ముద్ర పడింది.


రాజ్య సభలోనూ ఇదే విధంగా.. ఎలాంటి చర్చ లేకుండానే మూజువాణి ఓటు ద్వారా బిల్లు పాసైంది. పెద్దల సభలోనూ ఈ బిల్లుపై చర్చకు విపక్షాలు డిమాండ్ చేయగా అందుకు అనుమతి లభించలేదు.


Also read: ఒమిక్రాన్‌పై కేంద్రం అప్రమత్తత, అంతర్జాతీయ ప్రయాణాలపై మార్గదర్శకాలు


Also read: Bihar Pocso Court: అత్యాచార కేసులో ఒక్క రోజులోనే తీర్పు-బిహార్ పోక్సో కోర్టు రికార్డ్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook