కేంద్ర ప్రసార సమాచార మంత్రిత్వశాఖ తాజాగా ప్రజలపై దృష్టిసారించేందుకు ఓ నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ సెట్‌టాప్ బాక్స్‌లలో చిప్ అమర్చాలని యోచిస్తోంది. తద్వారా ప్రేక్షకులు ఏ ఛానల్ ఎంతసేపు చూస్తున్నారో తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తోంది.  ప్రజల అభిరుచిని తెలుసుకొనే పనిలో భాగంగా చిప్‌లను అమర్చే యోచన చేస్తున్నారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ విషయమై ఒక అధికారి మాట్లాడుతూ టీఆర్పీ రేటింగ్‌ను మరింత కచ్చితంగా తెలుసుకునేందుకే ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకొనబోతుందని అన్నారు. దీంతో విస్తృతంగా వీక్షించిన ఛానళ్లను మాత్రమే ప్రోత్సహించే అవకాశం ఉందన్నారు. తద్వారా ప్రభుత్వం ప్రకటనలను తగిన రీతిలో ఇవ్వగలుగుతుందని, ఈ విధంగా ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. ఈ ప్రతిపాదనపై స్పందించిన ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖ, కొత్త సెట్‌టాప్ బాక్సులలో చిప్ అమర్చాడానికి డీటీహెచ్ ఆపరేటర్లను అడగాలని తెలియజేసింది.


సెట్‌టాప్ బాక్సుల్లో చిప్ పెడితే మీరు టీవీలో ఏం చూస్తున్నారు? ఎంతసేపు చూస్తున్నారు? మీ అభిరుచి ఏంటి? మీకు ఇష్టమైన ఛానల్ ఏంటి? ఇలా అన్ని విషయాలు తెలిసిపోనున్నాయి.