'కరోనా వైరస్'  కారణంగా ఆర్ధికంగా బాగా చితికిపోయాం. జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు.  మాకు కేంద్రం నుంచి సహకారం చేయాల్సిన అవసరం ఉంది. ఇదీ ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'కరోనా వైరస్'  ఉద్ధృతంగా విస్తరిస్తూ ఉందని లాక్ డౌన్  విధించడంతో ఢిల్లీ ప్రభుత్వం ఆర్ధికంగా అతలాకుతలమైందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. తక్షణమే ఆర్ధిక సాయం చేసి ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్ధిక మంత్రి  నిర్మలా సీతారామన్ కు  లేఖ రాశామని పేర్కొన్నారు.  


ఢిల్లీ సర్కారు ఆదాయం, వ్యయాలపై సమీక్ష చేశామని మనీష్ సిసోడియా అన్నారు. ఐతే ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా ఆదాయం కరువైందని తెలిపారు. జీతాలు, ఆఫీసుల ఖర్చుల కోసం కనీసం నెలకు 3 వేల 500  కోట్ల రూపాయలు అవసరం అవుతాయని చెప్పారు. కానీ గత రెండు నెలల కాలంగా పన్నుల రూపంలో ఢిల్లీ ప్రభుత్వానికి కేవలం 500 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందన్నారు. పన్నులతోపాటు మిగతా ఆదాయాలతో కలిపితే మొత్తంగా రెండు నెలలకుగానూ 1735 కోట్ల రూపాయలు సమకూరిందని తెలిపారు. ఐతే జీతాలు ఇతర అవసరాల కోసం 7 వేల కోట్ల రూపాయలు అవసరమని చెప్పారు. 


ఇప్పటి వరకు ఢిల్లీ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదని మనీష్ సిసోడియా అన్నారు. కాబట్టి ఇప్పటికైనా కనీసం 5 వేల కోట్ల రూపాయలు గ్రాంట్ గా ఇవ్వాలని కోరారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..