Currency Showering: శుభ ముహూర్తాలు ఉండడంతో దేశవ్యాప్తంగా శుభకార్యాలు, వివాహాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. పెళ్లి చేసుకునే వారు తమ తాహత్తుకు మించి ఖర్చు చేస్తూ సమాజంలో తమ గౌరవ మర్యాదలు పెంచుకునేందుకు తాపత్రయపడుతున్నారు. ఆకాశమంత పందిరి భూదేవి అంతా పెళ్లి పీట వేసినట్టు వివాహాలు చేసుకునేందుకు నేటి తరం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే మోతాదుకు మించి ఖర్చులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ పెళ్లిలో ఓ కుటుంబం ఒక అడుగు ముందుకు వేసి అతిథులపై నోట్ల వర్షం కురిపించింది. రాచ మర్యాదలతో మురిసిపోయిన వారికి నోట్ల వర్షం కురిపించడంతో వచ్చిన అతిథులంతా నోట్ల వర్షంలో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Vizag: 'వచ్చి కోరిక తీరుస్తావా.. వీడియోలు బయటపెట్టాలా?'.. లా విద్యార్థిపై నలుగురు గ్యాంగ్‌ రేప్‌


ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌ జిల్లాలోని దేవల్‌హవ ప్రాంతంలో ఇటీవల ఓ వివాహం జరిగింది. వివాహ వేదికకు ఊరేగింపుగా పెళ్లి కుమారుడు వెళ్తున్నాడు. గుర్రంపై ఎక్కి ఉన్న వరుడితోపాటు బరాత్‌లో పాల్గొన్న బంధుమిత్రులపై ఆ కుటుంబం భారీగా నోట్ల వర్షం కురిపించింది. రూ.100, రూ.200, రూ.500 నోట్లను బంధువులపై విసిరారు. భవనాలపైకి ఎక్కి.. జేసీబీలపైకి ఎక్కి నోట్లు విసిరారు. వాళ్లు విసిరిన డబ్బు ఏకంగా రూ.20 లక్షలకు పైగా ఉంటుందని సమాచారం.

Also Read: Heart Attack: అమ్మ గ్రూపు 3 పరీక్ష రాసి వచ్చేసరికి నాలుగేళ్ల కుమార్తె గుండెపోటుతో మృతి


నోట్ల వర్షం కురవగా అక్కడి గ్రామస్తులతోపాటు వివాహానికి హాజరైన అతిథులు, బంధుమిత్రులు కూడా వాటిని తీసుకున్నారు. దీంతో అక్కడ కొంత గందరగోళం ఏర్పడిందని తెలుస్తోంది. అఫ్జల్‌ ఖాన్‌ అనే వ్యక్తి వివాహం నవంబర్‌ 6వ తేదీన జరిగిందని సమాచారం. బస్తీ జిల్లాలోని కమహరియా ప్రాంతానికి ఊరేగింపుగా వెళ్తున్న సమయంలో నోట్లు విసిరారని యూపీ మీడియా చెబుతోంది. ఇలా నోట్ల వర్షం కురిపించడం వెనుక ఓ కారణం ఉందని తెలుస్తోంది. తమ పెళ్లి వైరల్‌గా మారాలని భావించి ఇలా చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

నెటిజన్ల ఆగ్రహం
సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా అవ్వాలనే ఉద్దేశంతో ఇలా చేసినట్లు నెటిజన్లు చెబుతున్నారు. కాగా ఇలా చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'డబ్బులు ఉంటే ఇలా చూపించుకోవాల్నా? ఇది పద్దతేనా?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ డబ్బుతో పేదల పెళ్లిళ్లు రెండు మూడు చేసి ఉండేవారని కామెంట్‌ చేస్తున్నారు. ఉన్న డబ్బును సామాజిక సేవలకు వినియోగించాలి కానీ ఇలా పారేయడం తగదని సూచిస్తున్నారు. డబ్బులు పంచడం ద్వారా వచ్చిన అతిథులను అవమానించినట్టేనని పేర్కొంటున్నారు. ఈ డబ్బులు విసురుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.









స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter