ఢిల్లీ: దేశంలో విప్లవాత్మక జీఎస్టీ బిల్లు తీసుకొచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘జీఎస్టీ తర్వాత రెండేళ్లు’పేరుతో మాజీ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ  ఓ బ్లాగ్‌ రాశారు. నూతన పన్ను విధానం జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరవాత ప్రభుత్వ ఆదాయం పెరిగిందని జైట్లీ తెలిపారు. ఈ విధానం వల్ల దేశంలోని 20 రాష్ట్రాలు ఈ రెండేళ్లలో 14 శాతం అధిక రాబడి సాధించాయన్నారు జైట్లీ పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ ఒకే స్లాబ్ ప్రతిపాదనపై స్పందిస్తూ భారత్‌ లాంటి దేశాల్లో ఒకే పన్ను శ్లాబు విధానాన్ని అమలు చేయడం అసాధ్యమన్నారు. పేదలు లేని ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలకే ఒకే స్లాబు విధానం అమలుకు వీలవుతుందన్నారు. అయితే  ప్రస్తుతం జీఎస్టీ విధానంలో అమలులో ఉన్న ఉన్న 12శాతం, 18శాతం శ్లాబులను కలిపేసే వెసులుబాటు మాత్రం ఉందన్నారు. మన దేశ పరిస్థితులను బట్టి భవిష్యత్తలో  శ్లాబుల సంఖ్య రెండుకు తగ్గే అవకాశం ఉందని మాజీ ఆర్ధికమంత్రి జోస్యం చెప్పారు.


2016 ఆగస్టు 8 కల్లా ఉభయ సభలు జీఎస్టీ బిల్లును ఆమోదం తెలుపగా .. 2016 సెప్టెంబర్ 8న రాష్ట్రపతి ఆమోదం తెలిపి..అదే రోజు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.  అప్పటి నుంచి జీఎస్టీ పేరుతో నూతన పన్నుల విధానం కొనసాగుతోంది. కాగా జీఎస్టీ విధానంలో మొత్తం నాలుగు శ్లాబ్‌ల రేటు... 5శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతంగా ఉంది.ఇందులో సామాన్యులు ఎక్కువగా వినియోగించే వస్తువులపై పన్ను రేటును 5 శాతానికి పరిమితం చేశారు. స్టాండర్డ్‌ రేటు 12 శాతం, ఇతర వస్తువులపై 18 శాతం, ఆటోమొబైల్ , లగ్జరీ వస్తువులులతో పాటు ఆరోగ్యానికి హానికరం చేసే పొగాకు ఉత్పత్తులపై 28 శాతం పన్ను ఖరారు చేసింది. 


ఇదిలా ఉండగా  జైట్లీ పేర్కొన్నట్లుగా 12 శాతం, 18 శాతం కలిపితే స్లాబుల సంఖ్య మూడుకు తగ్గుతాయి. భవిష్యత్తులో దీన్ని రెండుకు కుదించే అవకాశముందని  మన మాజీ ఆర్ధిక మంత్రి జైట్లీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా మోదీ ప్రభుత్వం నుంచి వైదొలగిన తర్వాత జైట్లీ చేసిన తొలి బ్లాగ్‌ ఇదే కావడం విశేషం.