Fuel Prices: దేశంలో ఇప్పుడు అందర్నీ ఆందోళనకు గురి చేస్తున్న అంశం ఇంధన ధరల పెరుగుదల. అయితే ఇప్పట్లో పెట్రోల్, డీజిల్ ధరలకు కళ్లెం వేయడం సాధ్యం కాదని తెలుస్తోంది. ఎందుకు సాధ్యం కాదు..కారణాలేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరల (Fuel Prices)పెరుగుదల ప్రారంభమైనప్పటి నుంచి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గత కొద్దిరోజులుగా పరిస్థితి మరీ దారుణంగా మారింది. చాపకింద నీరులా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతూ.. సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో లీటరు పెట్రోల్ ధర ఇప్పటికే వంద రూపాయలు దాటింది. ఫలితంగా నిత్యావసరాల వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. పెరిగిన ఇంధన ధరలను తగ్గించాలని, పెట్రోలియం ఉత్పత్తులను గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(GST) పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్ పెరుగుతోంది. అయితే మరో పదేళ్ల వరకూ ఇంధన ధరల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపధ్యంలో ఆందోళన మరింతగా పెరుగుతోంది. ఈ విషయంపై రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ(Rajasabha mp sushil kumar modi) వివరణ ఇచ్చారు. 


రాజ్యసభలో ఆర్ధికబిల్లు(Finance Bill)పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం కుదరదని చెప్పారు.వచ్చే 8-10 సంవత్సరాల కాలంలో కూడా అది సాధ్యం కాబోదని చెప్పారు. అలా చేస్తే కేంద్ర, రాష్ట్రాలు ఆదాయం కోల్పోతాయన్నారు.పెట్రోలియం ఉత్పత్తులపై పన్నుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతి యేటా 5 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. ఇంధన ధరల్ని  జీఎస్టీలోకి చేరిస్తే రాష్ట్రాలు సంవత్సరానికి 2.5 లక్షల కోట్ల ఆదాయం కోల్పోతాయని తెలిపారు.


ప్రస్తుతం చమురు ఉత్పత్తుల మీద 60 శాతం పన్నులను విధిస్తుండగా.. జీఎస్టీ పరిధిలోకి తెస్తే దానిని 28 శాతానికి కుదించాలి. అంటే ప్రస్తుతం పెట్రోల్ లీటరుకు 100 రూపాయలైతే దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు 60 రూపాయల వరకూ ఉన్నాయి. ఒకవేళ దానిని జీఎస్టీ పరిధిలోకి తెస్తే ఈ పన్నులు కేవలం 14 రూపాయలే అవతుంది. 


Also read: Justice nv ramana: సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా ఎన్ వి రమణను సిఫారసు చేసిన ఎస్ఏ బోబ్డే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook