డోక్లామ్‌లో రక్షణమంత్రికి గార్డ్ ఆఫ్ హానర్
వివాదాస్పద డోక్లాం ప్రాంతంలో పర్యటిస్తున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ ఆదివారం నాథూలా పాస్ ఏరియాను పరిశీలించారు. అదే సమయంలో సరిహద్దు దగ్గర పహారా కాస్తున్న చైనా సైనికులు ఆమెను ఫొటో తీసేందుకు ప్రయత్నించారు. సీతారామన్ వారికి దూరం నుండే నవ్వుతూ చేతులూపారు. ఆ ఫోటోని ఆమె ట్విటర్ ద్వారా షేర్ చేశారు. సిక్కి, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ముఖ్యమైన సరిహద్దు ప్రాంతాలను కూడా ఆమె పరిశీలించారు. ఆ తర్వాత ఆమె రహదారి మార్గం ద్వారా నాథూలా పాస్‌కు చేరుకున్నారు. అక్కడే ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) అధికారులను కలిసి మాట్లాడారు. నాథూలా పాస్ చేరుకున్న రక్షణమంత్రికి ఈస్ట్రన్ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ ఆభయ్ కృష్ఱ గార్డ్ ఆఫ్ ఆనర్‌తో గౌరవించారు. తర్వాత మంత్రి ఏరియల్ సర్వే నిర్వహించారు.