న్యూఢిల్లీ : గుజరాత్ శాసనసభ ఎన్నికల రెండవ దశ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఆదివారం రాత్రి 76 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. నామినేషన్ల దాఖలు రేపటితో ముగుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందే రెండు దఫాలుగా 86 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.  అయితే.. కాంగ్రెస్ పార్టీ ఇంకా 20 సీట్లకు అభ్యర్థులను ఖరారుచేయలేదు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆస్కార్ ఫెర్నాండెజ్ నిన్న రాత్రి పొద్దుపోయాక మీడియాకు మూడవ జాబితా లిస్టును విడుదల చేశారు. విడుదల చేసిన జాబితాలో ఎస్టీలకు 11, ఎస్సీలకు 3 సీట్లు కేటాయించారు.


డిసెంబరు 9, 14 తేదీల్లో గుజరాత్లో రెండు దశల పోలింగ్ జరగనుంది. డిసెంబరు 18న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ రాష్ట్రాల్లో ఎనిమిది, తొమ్మిది సీట్లకు మొదటి దశలో పోలింగ్ జరుగుతుండగా, మిగిలిన 93 స్థానాల్లో మధ్య, ఉత్తర ప్రాంతాలలో రెండవ దశ పోలింగ్ జరుగుతుంది.