Vijay Roopani Resigned: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా
Vijay Roopani Resigned: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పదవికి రాజీనామా చేశారు. గుజరాత్‌లో నాయకత్వమార్పు జరగనున్న నేపధ్యంలోనే రాజీనామా చేసినట్టు సమాచారం.
Vijay Roopani Resigned: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పదవికి రాజీనామా చేశారు. గుజరాత్‌లో నాయకత్వమార్పు జరగనున్న నేపధ్యంలోనే రాజీనామా చేసినట్టు సమాచారం.
గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు(Gujarat Assembly Elections) వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ తరుణంలో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు. 2016 నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ రూపానీ గత కొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని..బీజేపీ అధిష్ఠానం నాయకత్వమార్పుకు ఆదేశించిన నేపధ్యంలోనే ఈ పరిణామం జరిగినట్టు తెలుస్తోంది.
ఈసారి గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా పటేల్ సామాజికవర్గం నుంచి ఎన్నుకోనున్నట్టు తెలుస్తోంది. కొత్త ముఖ్యమంత్రి రేసులో ఇప్పటికే నితిన్ పటేల్, సీఆర్ పటేల్, ఆర్‌సీ ఫాల్దూలు ఉన్నారని సమాచారం. పటేల్ సామాజికవర్గానికి చేరువయ్యే క్రమంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. గత కొద్దికాలంగా వివిధ రాష్ట్రాల్లో బీజేపీ(Bjp)అధిష్టానం నాయకత్వమార్పును సూచిస్తోంది. విజయ్ రూపానీ(Vijay Roopani) ఏబీవీపీ కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. 1998లో బీజేపీ రాష్ట్ర ప్రధా కార్యదర్శిగా పనిచేసిన విజయ్ రూపానీ ఆ తరువాత అంటే 2006-12 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. అనంతరం 2016 నుంచి ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్నారు. ఇప్పుడు వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో నాయకత్వ మార్పు చేస్తోంది బీజేపీ అధిష్టానం.
Also read: Golden Hour: గోల్డెన్ అవర్ అతనికి ఓ వరం, అందుకే ప్రాణాపాయం తప్పింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook