గుజరాత్ పోరు: బీజేపీ అభ్యర్ధుల మూడో జాబితా విడుదల
గుజరాత్ ఎన్నికల పోరులో భాగంగా 28 మంది అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ సోమవారం విడుదల చేసింది. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్‌లో ఆ పార్టీ ఇప్పటి వరకు 134 అభ్యర్ధులను ప్రకటించింది. తొలి దశలో 70 అభ్యర్ధులను ప్రకటించగా.. రెండో దశలో 36 మంది అభ్యర్ధులను ప్రకటించింది. కాగా మిగిలిన స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఎంపికపై బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. డిసెంబర్ 9, 14 తేదీల్లో రెండు దఫాలుగా గుజరాత్ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎన్నకల్లో పోటీ చేసే అభ్యర్ధులను దశలవారిగా ప్రకటిస్తోంది. కాగా కాంగ్రెస్ పార్టీ 70 మంది అభ్యర్ధుల తొలి జాబితాను ఆదివారం ప్రకటించింది.