గుజరాత్ ఎన్నికలకు సంబంధించి వస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపించడంతో పాటు దేశీయ కరెన్సీ బలపడడానికి తావిస్తున్నాయి అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఫారెక్స్ మార్కెట్‌లో ఈ ఫలితాల ప్రభావంతో.. అలాగే బీజేపీ విజయం సాధించనుంది అనే వార్తలు రావడంతో.. ట్రేడింగ్ ప్రారంభంలో డాలరుతో మారకంలో రూపాయి విలువ 18 పైసలు పెరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురువారం సాయంకాలానికి రూపాయి 10 పైసలు లాభపడి, డాలరు మారకంలో 64.34 వద్ద నిలిచింది. గుజరాత్ ఎన్నికలు ముగిశాక.. దేశీయ ఈక్విటీలో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టారు. మోదీ ప్రభుత్వం గనుక మరల గుజరాత్‌లో గనుక అధికారంలోకి వస్తే.. మరిన్ని విదేశీ పెట్టుబడులు భారత్‌లోకి వచ్చే అవకాశం ఉందని తెలియడంతో ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఫలితాలు వెలువడే సరికి, మరిన్ని పెట్టుబడులు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు స్టాక్ మార్కెట్ నిపుణులు