సంబరాలకు సిద్ధమౌతున్న కమలనాథులు
గుజరాత్ లో బీజేపీ గెలుపు దాదాపు ఖాయమైన నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకునేందుకు సిద్ధమౌతున్నారు
గుజరాత్: ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన జాబితాలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం 92కు పైగా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
ఐదో రౌండ్ ఫలితాల వరకూ విజయలక్ష్మి వరిస్తుందా లేదా అన్న ఆలోచనలు దోబూచులాడుతుండటంతో కాస్త ఆందోళనగా కనిపించిన బీజేపీ శ్రేణులు... ఆపై ఫలితాల సరళి తమకు అనుకూలంగా మారడంతో గాంధీనగర్ పార్టీ కార్యాలయం వద్ద కోలాహలం మొదలైంది.
ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి మిఠాయిలు పంచుకుంటున్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలోనూ సంబరాలు ప్రారంభమయ్యాయి.