అహ్మదాబాద్: అహ్మదాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం 9.30 గంటలకు సబర్మతి నదిపై ల్యాండ్ అయ్యారు. విమానం నుండి దిగితన తరువాత ధరోయి డ్యామ్ కు వెళ్లి అంబాజీ ఆలయంలో ప్రార్ధనలు చేస్తారు. గుజరాత్ లో ఈరోజు తన ఎన్నికల ప్రచారాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే, ఇండియాలో ఎన్నికల ప్రచారానికి  సీ ప్లేస్ సేవలను ఉపయోగించుకుంటున్న తొలి ప్రధాని మోదీయే. కాగా ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఊహకు కూడా అందనంత అభివృద్ధి బీజేపీ హాయాంలో గుజరాత్ లో జరిగిందని చెప్పడానికే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.  


ప్రతిచోటా ఎయిర్ పోర్ట్ లను నిర్మించలేకపోతున్నామని, అందుకోసం దేశవ్యాప్తంగా 106 ప్రదేశాల్లో విమానాలు ఎక్కేందుకు, దిగేందుకు అనువుగా ఉన్న జలాశయాలను గుర్తించినట్టు మోదీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. 


కాగా మరోవైపు మినిట్స్ తరువాత, ఉదయం 10 గంటలకు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీడియా సమావేశంలో  ఇదే ప్రకటన చేయాలని పిలుపునిచ్చారు. "ఇది మంగళవారం ఉదయం 9.30 సమయంలో జరగబోయే ఈవెంట్ షెడ్యూల్" అని అమిత్ షా చెప్పారు.