Gujarat Elections 2022: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రవీంద్ర జడేజా భార్య.. ఏ స్థానం నుంచి పోటీ చేయనున్నారో తెలుసా?
Rivaba Jadeja: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా బరిలోకి దిగనున్నారు. ఆమె జామ్‌నగర్(నార్త్) నుంచి పోటీకి దిగనున్నారు.
Gujarat Assembly Elections 2022: టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. బీజేపీ తరుపున ఆమె బరిలోకి దిగనున్నారు. ఆమె జామ్‌నగర్(నార్త్) నుంచి పోటీకి దిగనున్నారు. మూడేళ్ల కిందట బీజేపీలో చేరిన రివాబా (Rivaba Jadeja).. 2016లో జడేజాను వివాహం చేసుకున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు 160 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ (బిజెపి) గురువారం ప్రకటించింది. ఇందులో ఘట్లోడియా నియోజకవర్గం నుంచి సీఎం భూపేంద్ర పటేల్ పోటీ చేయనుున్నారు. అలాగే గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి మజురా నియోజకవర్గం నుంచి, హార్దిక్ పటేల్ విరామ్‌గాం నియోజకవర్గం నుండి ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు. ఇవాళ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని చూస్తోంది. ఈనేపథ్యంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా తరుచూ గుజరాత్ లో పర్యటిస్తూ ప్రసంగాలు ఇస్తున్నారు. 2017లో బీజేపీకి 99, కాంగ్రెస్‌కు 77 సీట్లు వచ్చాయి. ఈసారి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రవేశంతో ముక్కోణపు పోరు తప్పేలా లేదు. రీసెంట్ గా 10 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మోహన్‌సింగ్ రత్వా రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో అధికార పార్టీ బలం మరింత పెరిగింది. 182 మంది సభ్యుల గుజరాత్ అసెంబ్లీకి ఓటింగ్ రెండు దశల్లో (డిసెంబర్ 1,5 తేదీల్లో) జరుగుతుంది. డిసెంబరు 8న ఫలితాలు ప్రకటిస్తారు.
Also Read: Nitin Gadkari, Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ని ఆకాశానికెత్తిన నితిన్ గడ్కరి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook