Gujarat Omicron cases: గుజరాత్‌లో గురువారం మరో 7 ఒమిక్రాన్ కొవిడ్-19 వేరియంట్ కేసులు(Omicron cases in Gujarat) నమోదయ్యాయి, దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 30కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 25 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో మెుత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 300మార్కుని దాటింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ(PM Modi) ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఒక్కరోజే తమిళనాడు(Tamilnadu omicron cases)లో అత్యధికంగా 33 ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూశాయి. కేరళ(Kerala)లో మరో ఐదుగురు ఒమిక్రాన్​ వేరియంట్​ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 29కి చేరింది. కర్ణాటక(Karnataka Omicron cases)లో ఒకేరోజు 12 కొత్త ఒమిక్రాన్​ కేసులు నమోదయ్యాయి. బంగాల్​లో ఇద్దరు వ్యక్తులకు తాజాగా ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య మూడుకు చేరింది. రాజస్థాన్​లోని అజ్మీర్​లో ఒమిక్రాన్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ మహమ్మారి బారిన పడిన వారిలో 104 మంది వరకు కోలుకున్నట్టు కేంద్రం తెలిపింది. 




Also Read: Omicron cases in Karnataka: కర్ణాటకలో ఒమిక్రాన్ కలవరం...మరో 12 కేసులు నమోదు..


ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్ని కేంద్ర ప్రభుత్వం(Central Government) మరోసారి అప్రమత్తం చేస్తూ మార్గదర్శకాలు జారీచేసింది. అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలిచ్చింది. ముఖ్యంగా పండగల వేళ రాత్రిపూట కర్ఫ్యూ(Night Curfew)లను అమలుచేయడంతో పాటు భారీ సభలు, జనసమూహాల్ని నియంత్రించాలని ఆదేశించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook