Gujarat - Surat MP Seat: ఎన్నికలకు ముందే బీజేపీకి తొలి విక్టరీ.. ఆ ఎంపీ సీటుకు ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న కాషాయ పార్టీ..
Gujarat - Surat MP Seat: ఎన్నికల ముందే బీజేపీ తొలి లోక్ సభ సీటు గెలుచుకొని సంచలనం రేపింది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌లోని ఐదు అసెంబ్లీ స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న కాషాయ పార్టీ.. ఇపుడు తాజాగా లోక్ సభ ఎన్నికలు ముంగట ఒక స్థానాన్ని ఏకగ్రీవంగా గెలుచుకొని బోణి కొట్టింది.
Gujarat - Surat MP Seat: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 18వ లోక్ సభకు ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే మొదటి విడతలో దేశ వ్యాప్తంగా 102 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక మిగిలిన 6 విడతల్లో మిగతా స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌లోని ఐదు అసెంబ్లీ స్థానాలను ఏక గ్రీవంగా కైవసం చేసుకొని సంచలనం రేపింది భారతీయ జనతా పార్టీ. తాజాగా భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎన్నికల ముందే తొలి లోక్ సభ సీటును ఏకగ్రీవంగా గెలుచుకొని బోణి కొట్టింది. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లోక్ సభ స్థానానికి బీజేపీ తరుపున ముఖేష్ దలాల్, కాంగ్రెస్ నుంచి నీలేష్ కుభానీలు బరిలో ఉన్నారు. వీళ్లిద్దరు తమ తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేసారు. అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి నీలేష్ కుభానీ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. మరోవైపు పోటీలో ఉన్న 7 గురు స్వతంత్య్ర అభ్యర్ధులు కూడా తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో వజ్రాల నగరం సూరత్ లోక్ సభ సీటను ఎన్నికల ముందే బీజేపీ ఖాతాలో చేరింది. గతంలో ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. తాజాగా సూరత్ పార్లమెంట్ సీటును బీజేపీ ఎన్నికల ముందే గెలుచుకోవడం ఆ పార్టీకి దక్కిన విజయమని బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇక గుజరాత్ రాష్ట్రంలో మే 7న మూడో విడతలో 26 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ సూరత్ ఏకగ్రీవం కావడంతో మిగిలిన 25 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఇక్కడ గుజరాత్ లోని గాంధీ నగర్ నుంచి రెండోసారి లోక్ సభ బరిలో ఉన్నారు. ఈ స్థానంలోనే ప్రధాన మంత్రి తన ఓటు హక్కు వినియోగించుకోనునున్నారు.
Also Read: TDP Candidates Change: ఎన్నికల వేళ టీడీపీ భారీ ట్విస్ట్.. రఘురామ కృష్ణంరాజుకు ఛాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter