గురుగ్రామ్‌లో ముస్లిం సోదరులు బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయడంపై పలు సంఘాలు అభ్యంతరాలు వ్యక్తంచేస్తుండటంపై గురుగ్రామ్‌లోని సదర్ బజార్‌లో ఉన్న గురుద్వారా అసోసియేషన్ మానవతా దృక్పథంతో స్పందించింది. గురుద్వారా ఆధీనంలో ఉన్న ఖాళీ స్థలంలో ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతిస్తున్నట్టుగా గురుద్వారా అసోసియేషన్ స్పష్టంచేసింది. ఇదే విషయమై గురుద్వార గురు సింగ్ సభ అధ్యక్షుడు షెర్ధిల్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ.. '' ఇది గురు సన్నిధి అని, ఇక్కడ అందరూ సమానమే అనే దృష్టితో ముస్లిం సోదరులను ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతించాలని నిర్ణయించుకున్నాం'' అని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురుద్వారాలో ముస్లిం సోదరులు శుక్రవారం ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతించడంపై దయచేసి ఎలాంటి రాజకీయాలు చేయొద్దు. ఇకపై ప్రతీ శుక్రవారం గురుద్వారాలోని బెస్‌మెంట్ స్థలం ముస్లిం సోదరుల కోసం తెరిచే ఉంటుందని షెర్డిల్ సింగ్ చెప్పినట్టుగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది. 


ఎక్కడైనా ఖాళీ స్థలం ఉందంటే.. అక్కడ ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకునేందుకు వారిని అనుమతించాలి. ఈ విషయంలో పెద్ద రాద్ధాంతం చేయకూడదు. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే వారు ఖాళీ స్థలాల్లో ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఈ విషయంలో ఎవరికైనా, ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే.. చట్టాన్ని ఆశ్రయించాలి కానీ ఇలా దాడులు చేయడం సరికాదు అని షెర్డిల్ సింగ్ హితవు పలికారు.


Also read : 'టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్​, నిఖిల్ జైన్​ల వివాహం భారత్​లో​ చట్టబద్దం కాదు'


గతంలో ముస్లిం సోదరులు నమాజ్ చేసుకోవడానికి వీలుగా ఖాళీగా ఉన్న 37 స్థలాలకు గురుగ్రామ్ అధికారులు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో పలు చోట్ల ఉన్న స్థానిక అపార్ట్‌మెంట్ అసోసియేషన్స్, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ నుంచి అభ్యంతరాలు రావడంతో 8 బహిరంగ ప్రదేశాల్లో అనుమతి ఉపసంహరించుకుంటూ గురుగ్రామ్ అధికారులు నవంబర్ 3న ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలోనే గురుద్వారా అసోసియేషన్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. 


8 బహిరంగ ప్రదేశాల్లో శుక్రవారం నమాజ్‌కి అనుమతి రద్దు చేయడంపై అసంతృప్తి వ్యక్తంచేసిన ముస్లిం సంఘాలు.. '' వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్న స్థలాల్లో ఆక్రమణలు తొలగిస్తే.. ఎవ్వరికీ, ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాము ఆ స్థలాల్లోనే శుక్రవారం నమాజ్ చేసుకుంటాం'' అని స్పష్టంచేశాయి. దీంతో బంతి ఈసారి మళ్లీ గురుగ్రామ్ మునిసిపల్ అధికారుల కోర్టులోనే పడినట్టయింది.


Also read : పాక్ ఆక్రమిత కశ్మీర్ ఖాళీ చేయాల్సిందే, ఇండియా వార్నింగ్


Also read : తల్లి సెల్ ఫోన్ తీసుకుందని మస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook