Gyanavapi masjid Dispute: ఉత్తరప్రదేశ్‌లో బాబ్రీ మసీదు తరహా వివాదం మరోసారి రిపీట్ అవుతోంది. ఈసారి వారణాసి పట్టణంలో ఉన్న జ్ఞానవాపి మసీదు వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచింది. వారణాసి కోర్టు ఆదేశాల మేరకు మసీదులో వీడియోగ్రఫీ ద్వారా సర్వే నిర్వహించగా... అక్కడి కొలనులో శివలింగం ఉన్నట్లు సర్వే బృందం కోర్టుకు నివేదించింది. దీంతో ఆ కొలను ప్రాంతాన్ని సీజ్ చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పరోక్షంగా స్పందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్ఙానవాపి మసీదును ముస్లింలు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరని అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. 'నేను 19-21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బాబ్రీ మసీదు లాగేసుకోబడింది. ఇకపై మరే మసీదును కోల్పోమని మీరంతా ప్రమాణం చేస్తారా.. ఇకపై ఏ మసీదును మనం దూరం చేసుకోబోమనే విషయం వారికి తెలియాలి. ఒకే పాముతో రెండుసార్లు కాటు వేయబడని వ్యక్తి మొమిన్ (ఇస్లాంను విశ్వసించే వ్యక్తి). వాళ్లు మనల్ని రెండోసారి కాటు వేస్తామంటే ఒప్పుకోము.' అని ఒవైసీ పేర్కొన్నారు.


మసీదులన్నింటినీ అల్లాను ఆరాధించేవారితో నింపగలిగితే... ఇకపై ఏ మసీదును కోల్పేయేందుకు మనం సిద్ధంగా లేమనే విషయం ఆ పైశాచిక శక్తులకు అర్థమవుతుందన్నారు ఒవైసీ. జ్ఞానవాపి మసీదు వివాదంపై ఓ సభలో చేసిన వ్యాఖ్యలను ఒవైసీ వీడియో రూపంలో ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఒవైసీ వ్యాఖ్యలకు ఆ సభలో పాల్గొన్నవారు హర్షం వ్యక్తం చేశారు.


ఇదే అంశంపై మరో ట్వీట్‌లో ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జ్ఙానవాపి మసీదు ఒక మసీదు అని... కోర్టు తీర్పు వచ్చేంతవరకూ అది మసీదుగానే ఉంటుందని అన్నారు. 1949 డిసెంబర్ నాడు బాబ్రీ మసీదు విషయంలో జరిగిందే ఇప్పుడు పునరావృతమవుతోందని అన్నారు. వారణాసి కోర్టు తీర్పు జ్ఞానవాపి మసీదు మతపరమైన స్వభావాన్ని మార్చేసిందన్నారు. దీనిపై తాను ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. 


అసలేంటీ వివాదం : 


వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని ఆనుకుని జ్ఞానవాపి మసీదు ఉంది. 1664లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాశీ విశ్వనాథ్ ఆలయంలో కొంత భాగాన్ని కూల్చివేశారనే వాదన ఉంది. ఆ భాగంలోనే మసీదును నిర్మించారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా దీనిపై వారణాసి కోర్టు వీడియోగ్రఫీ సర్వేకు అనుమతించగా 54 మందితో కూడిన బృందం మసీదులో సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా 12 అంగుళాల పొడవు, 8 అంగుళాల వ్యాసార్థంతో ఉన్న శివలింగాన్ని అక్కడ గుర్తించినట్లు వెల్లడైంది. దీంతో ఈ ప్రాంతాన్ని సీజ్ చేయాల్సిందిగా కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. మంగళవారం (మే 17) అది విచారణకు రానుంది. 




Also Read: Women's T20 Challenge: మే 23 నుంచి మహిళల టీ20 ఛాలెంజ్.. మిథాలీ, ఝులన్‌కు నిరాశ!


Also Read: సర్కారు వారి పాట' సినిమా చూసేందుకు.. ముసుగేసుకుని థియేటర్‌కు వెళ్లిన స్టార్ హీరోయిన్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.