Gyanvapi Mosque Latest News: పవిత్ర కాశీ క్షేత్రంలోని జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగం గుర్తించడంపై విశ్వహిందూ పరిషత్‌ స్పందించింది. రెండు రోజులుగా దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచిన జ్ఞాన్‌వాపి మసీదు వ్యవహారంపై వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యాధ్యక్షులు, సీనియర్‌ న్యాయవాది అలోక్‌ కుమార్‌ తమ సంస్థ తరపున స్పందించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్ఞానవాపి మసీదులో ప్రత్యేక బృందం నిర్వహించిన సర్వేలో శివలింగం బయటపడిందని.. ఇరువర్గాలు, ఇరువర్గాలకు చెందిన న్యాయవాదుల సమక్షంలో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకోవడం చారిత్రాత్మకమని అలోక్‌ కుమార్‌ చెప్పారు. అంటే.. జ్ఞానవాపి అనేది మసీదు కాదని మందిరం అని రుజువైందని స్పష్టంచేశారు. ఈ పరిణామం దేశవ్యాప్తంగా సంతోషకరమైన వార్తగా వీహెచ్‌పీ భావిస్తోందన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శివలింగం లభ్యమైన ప్రాంతం ఒక దేవాలయం అని, ఈ ఆలయం ఎంతో ప్రాచీనమైనదని రుజువైనట్లు అలోక్ కుమార్ పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలతో చేపట్టిన సర్వేలో సాక్ష్యాధారాలతో సహా బయటకు వచ్చిన ఈ వాస్తవాన్ని దేశ ప్రజలంతా ఆమోదిస్తారని, గౌరవిస్తారని అలోక్‌ కుమార్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. శివలింగ దర్శనం తర్వాత చరిత్రలో పరిణామాల గురించి మరోసారి చర్చ మొదలయ్యిందన్నారు. శివలింగం కనుక్కున్న ప్రాంతాన్ని కోర్టు భద్రపరిచి సీలు వేసిందన్న అలోక్‌.. అక్కడ ఆధారాలు చెరిగిపోకుండా, అవకతవకలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. 


జ్ఞానవాపి వివాదం అంశం న్యాయస్థానంలో ఉన్న కారణంగా.. ఈ పరిణామం, పర్యవసానాలపై వ్యాఖ్యానించడం సరికాదని అలోక్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. కోర్టు తుది ఆదేశాలు వెలువడిన తర్వాత.. ఈ పరిణామాలపై విశ్వహిందూ పరిషత్‌ సమీక్షిస్తుందని, ఆ తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ ఏంటన్నది నిర్ణయిస్తామని చెప్పారు. వచ్చే జూన్‌ 11, 12 తేదీల్లో హరిద్వార్‌లో జరగనున్న వీహెచ్‌పీ కేంద్రీయ మార్గదర్శక్‌ మండల్‌ సమావేశంలో జ్ఞానవాపి అంశంపై (Gyanvapi Mosque Issue) సాధుసంతులతో కలిసి చర్చిస్తామన్నారు.


Also read : Gyanavapi masjid Dispute: ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోం... జ్ఙానవాపి మసీదు వివాదంపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు


Also read : Gyanvapi Masjid: జ్ఞానవాపి మసీదు అంశంతో తెరపైకి మరో కొత్త వివాదం..ఆ వివరాలు..!


Also read : Gyanvapi Masjid Survey: వివాదాస్పద జ్ఞానవాపి మసీదులో పూర్తయిన సర్వే, బయటపడిన శివలింగం..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.