ఆరేళ్ల తర్వాత పాకిస్తాన్ జైలు నుంచి హమీద్ అన్సారి విడుదల.. ఎక్స్‌క్లూజీవ్ ఫోటో!
పాకిస్తాన్ జైలు నుంచి హమీద్ అన్సారి విడుదల
న్యూఢిల్లీ: ఆరేళ్ల క్రితం పాకిస్తాన్‌లో అక్కడి పోలీసులకు చిక్కి, అప్పటి నుంచి పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న భారతీయ ఖైదీ హమీద్ నెహాల్ అన్సారి ఎట్టకేలకు ఇవాళ విడదలయ్యారు. పాకిస్తాన్‌లో వున్న తన ప్రియురాలిని కలుసుకోవడానికి 2012లో వీసా లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్కడకు వెళ్లిన హమీద్ నెహల్ అన్సారీని పాక్ పోలీసులు గూఢచర్యం అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 2015లో విచారణ చేపట్టిన పాక్ మిలిటరీ కోర్టు హమీద్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఇవాళ భారత్‌కి రానున్న హమీద్ అన్సారి కోసం అతడి కుటుంబసభ్యులు భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లోని అట్టారి-వాఘా సరిహద్దుల్లో వేయి కళ్లతో వేచిచూస్తున్నారు.