Harak Singh Rawat: కేబినెట్ నుంచి తొలగించడంపై కన్నీటి పర్యంతమైన మంత్రి, వీడియో వైరల్
Harak Singh Rawat: ఉత్తరాఖండ్ కేబినెట్ నుంచి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి హరక్ సింగ్ బహిష్కరణకు గురయ్యారు. ఆ విషయం తెలిసి మంత్రి వెక్కి వెక్కి ఏడ్చారు.
Harak Singh Expelled from Uttarakhand Cabinet: ఉత్తరాఖండ్ కేబినెట్ (Uttarakhand Cabinet) నుంచి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి హరక్ సింగ్ బహిష్కరణకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. సీఎం పుష్కర్ సింగ్ ధామి..హరక్ సింగ్ (Harak Singh Rawat) ను తొలిగించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
ఉత్తరాఖండ్ కేబినెట్ నుంచి హరక్‌సింగ్ రావత్‌ను తొలగించాలని సీఎం ధామీ (CM Pushkar Singh Dhami) గవర్నర్‌కు లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొందరు.. కాంగ్రెస్ నేతలతో సమావేశమైన తర్వాత ఆయనను మంత్రివర్గం, పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి తొలగించారు.
''ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు వారు (బీజేపీ) ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదు. నేను కాంగ్రెస్‌ని వీడి బీజేపీలో చేరకపోయి ఉంటే నాలుగేళ్ల క్రితమే బీజేపీకి రాజీనామా చేసి ఉండేవాడిని. మంత్రి పదవిపై నాకు పెద్దగా ఆసక్తి లేదు, నేను పని చేయాలనుకున్నాను''- హరక్ సింగ్ రావత్
Also Read: Pandit Birju Maharaj: ప్రముఖ కథక్ డ్యాన్సర్ పండిట్ బిర్జు మహారాజ్ కన్నుమూత
కాంగ్రెస్‌లో చేరే అవకాశం
హరక్ సింగ్ రావత్ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ (Harish Rawat), ఉత్తరాఖండ్ కాంగ్రెస్ చీఫ్ గణేష్ గోడియాల్ సమక్షంలో కాంగ్రెస్‌లో (Congress) చేరే అవకాశం ఉంది. హరక్ సింగ్ రావత్‌తో పాటు మరో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్ నాయకుడు హరీష్ రావత్‌పై తిరుగుబాటు చేసి 2016లో బీజేపీలోకి మారిన పది మంది ఎమ్మెల్యేల్లో హరక్ సింగ్ రావత్ కూడా ఉన్నారు.
ఆ మూడు పార్టీల మధ్యే పోరు
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు (Uttarakhand Assembly Elecions 2022) ఒకే దశలో ఫిబ్రవరి 14, 2022న జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. ఉత్తరాఖండ్‌లో 2017లో జరిగిన చివరి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలలో 57 గెలుచుకుంది. ఈసారి ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ, హరీశ్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్, అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోరు జరిగే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి