Rahul Gandhi PM Candidate: రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకుడు, లోక్‌సభ పక్ష నేత రాహుల్‌ గాంధీని కలను చెరిపేశాయి. భారత్‌ జోడో యాత్ర, న్యాయ్‌ యాత్రతో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించడంతో రాహుల్‌ చరిష్మా అని వార్తలు వచ్చాయి. ఇక రాహుల్‌ పరిపక్వత చెందిన నాయకుడిగా ఎదిగాడని.. ఇక నరేంద్ర మోదీకి ప్రధాన ప్రత్యర్థి.. గట్టి పోటీనిచ్చే నాయకుడు రాహుల్‌ గాంధీ అని చర్చ జరిగింది. తీరా చూస్తే సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నాలుగు నెలల తర్వాత జరిగిన రెండు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి చేదు ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా హర్యానా ఫలితాలు మాత్రం ఊహించనివి. రాహుల్‌ నాయకత్వానికి హర్యానాలో హస్తం పార్టీ తప్పక గెలుస్తుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఫలితాలు వేరుగా వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక జమ్మూ కశ్మీర్‌లో కూడా అదే పరిస్థితి. కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ఇండి కూటమి విజయం సాధించినా కాంగ్రెస్‌ పార్టీ మాత్రం అతి తక్కువ స్థానాలు పొందింది. మిత్రపక్షమైన నేషనల్‌ కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్‌ పార్టీ ఐదు స్థానాలకు పరిమితమైంది. కూటమి గెలిచిందనే ఆనందం కాంగ్రెస్‌ శ్రేణులకు లేకుండాపోయింది. అయితే ప్రభుత్వంలో భాగస్వామిగా కాంగ్రెస్‌ భాగం కానుంది.


రాహుల్‌ కల దూరం
లోక్‌సభ ఎన్నికల అనంతరం ప్రధానమంత్రి అయ్యే లక్షణాలు రాహుల్‌ గాంధీలో ఉన్నాయని కాంగ్రెస్‌ శ్రేణులు భావించాయి. ఇండి కూటమి కూడా రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని భావిస్తున్న క్రమంలో జమ్మూ కశ్మీర్‌, హర్యానా ఎన్నికలు దెబ్బ కొట్టాయి. ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి కావాల్సిన లక్షణాలు రాహుల్‌లో లేవని తాజా ఫలితాలు తేటతెల్లం చేశాయి. ఈ ఫలితాలతో రాహుల్‌ ప్రధాని ఆశలు వదులుకోవాల్సిందేనని విశ్లేషకులు చెబుతున్నారు.


ఇక త్వరలో జరుగనున్న మరికొన్ని రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాలు దక్కకపోవచ్చని సర్వేలు చెబుతున్నాయి. ఒక్క కర్ణాటక మినహా మిగతా చోట్ల కాంగ్రెస్‌ పార్టీకి గడ్డు పరిస్థితులేననే చర్చ జరుగుతోంది. రాహుల్‌ గాంధీకి ప్రజల్లో ఆదరణ లేకపోవడం.. పార్టీలో కుమ్ములాటలు ఆ పార్టీని దెబ్బతీస్తున్నాయని తెలుస్తోంది. మోదీకి దీటుగా సమాధానం ఇవ్వడంలో రాహుల్‌ విఫలమవుతున్నారు. ఇంకా నాయకుడిగా పరిపక్వత చెందలేదని.. మరింత రాటుదేలాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి