Anil Vij: కోవ్యాక్సిన్ తీసుకున్న హర్యానా మంత్రికి కరోనా పాజిటివ్
కోవ్యాక్సిన్ ట్రయల్స్‌లో భాగంగా టీకా తీసుకున్న హర్యానా హోంమంత్రి, ఆరోగ్యమంత్రి అనిల్ విజ్ ( Haryana Health Minister Anil Vij ) కు కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. తాజాగా జరిపిన పరీక్షలో (Coronavirus) కరోనా పాజిటివ్‌గా తెలినట్లు అనిల్ విజ్ శనివారం ఉదయం తెలిపారు.
Minister Anil Vij tested Covid-19 positive: న్యూఢిల్లీ: కోవ్యాక్సిన్ ట్రయల్స్‌లో భాగంగా టీకా తీసుకున్న హర్యానా హోంమంత్రి, ఆరోగ్యమంత్రి అనిల్ విజ్ ( Haryana Health Minister Anil Vij ) కు కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. తాజాగా జరిపిన పరీక్షలో (Coronavirus) కరోనా పాజిటివ్‌గా తెలినట్లు అనిల్ విజ్ శనివారం ఉదయం తెలిపారు. ప్రస్తుతం ఆయన అంబాలాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనకు సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని అనిల్ విజ్ సూచించారు. నవంబరు 20వ తేదిన కోవ్యాక్సిన్ ట్రయల్స్‌లో భాగంగా అంబాలాలోని కోవిడ్ ఆసుపత్రిలో అనిల్ విజ్ స్వచ్ఛందంగా కోవిడ్ టీకాను వేయించుకున్నారు. రాష్ట్రంలో ప్రారంభమయిన కోవ్యాక్సిన్ ట్రయల్స్‌లో మొదటి వాలంటీర్‌గా టీకాను తీసుకున్నారు. అనంతరం 15 రోజులకే ఆయన కరోనా బారిన పడటంతో వ్యాక్సిన్ విశ్వనీయతపై అంతటా ఆందోళన నెలకొంది.
కోవ్యాక్సిన్ తీసుకున్న హర్యానా మంత్రి అనిల్ విజ్ ( Anil Vij ) కు కరోనా సోకడంపై భారత్ బయోటెక్ ( Bharat Biotech ) సంస్థ స్పందించింది. కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ షెడ్యూల్ ప్రకారం.. రెండో డోస్‌లను 28 రోజుల వ్యవధిలో ఇవ్వనున్నట్లు పేర్కొంది. అయితే రెండో డోస్ ఇచ్చిన 14 రోజుల తర్వాత టీకా సామర్థ్యం తెలుస్తుందని తెలిపింది. రెండు డోస్‌లను స్వీకరించిన వారికే కోవాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తోందని భారత్ బయోటెక్ వివరించింది. Also read: Anil Vij: కోవ్యాక్సిన్ డోసు తీసుకున్న హర్యానా ఆరోగ్య మంత్రి
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సహకారంతో భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్ (Covaxin)ను అభివృద్ధి చేస్తోంది. మొదటి, రెండో దశ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ ద్వారా ఉత్తమ ఫలితాలు రావడంతో.. భారత్ బయోటెక్ కోవాక్సిన్ తుది దశ క్లినికల్ ట్రయల్స్ ( ‘Covaxin’ 3rd Phase trials ) ను నవంబరు 16 నుంచి దేశ్యావ్యాప్తంగా ప్రారంభించింది. Also read: Good News: ఫిబ్రవరి నాటికి కరోనా వ్యాక్సిన్: సీరం సీఈవో పూనావాలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి