Farmers Protests Live Updates | కర్నాల్: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళన (Farmers protest) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) కర్నాల్ జిల్లాలోని కైమ్లా గ్రామంలో ఆదివారం మహా కిసాన్ పంచాయత్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నారన్న సంగతి తెలుసుకున్న వందలాది మంది రైతులు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైతులు నల్ల జెండాలతో, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కిసాన్ మహా పంచాయత్ సభకు వెళ్తుండగా వారిని హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు రైతులపై లాఠిఛార్జ్ చేసి బాష్పవాయు గోళాలు, జల ఫిరంగులు ప్రయోగించి వారిని చెదరగొట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించేందుకు మనోహర్ లాల్ ఖట్టర్ ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కైమ్లా గ్రామంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి సభకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తే నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని (Haryana police) కర్నాల్ డిప్యూటీ కమిషనర్ నిశాంత్ యాదవ్ తెలిపారు. Also Read: Farmers Protest: విషం తాగి రైతు బలవన్మరణం


అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను (Farm Laws) రద్దు చేయాలని రైతులు నెలన్నర రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికే కేంద్రం, రైతు సంఘాల మధ్య ఎనిమిదిసార్లు జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. మరలా జనవరి 15న చర్చలు జరగనున్నాయి. Also read: Farmer protests: రైతులందరూ ఆ లేఖను చదవాలి: ప్రధాని మోదీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook