Haryana New CM BJP Nayab Singh Saini After Manoharlal: ఎంపీ ఎన్నికల వేళ దేశంలో రాజకీయాలు మరింత హీట్ ను పెంచుతున్నాయి. హర్యానాలో రాజకీయాల్లో మరో మలుపు చోటు చేసుకుంది. కొద్ది గంటల క్రితమే హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, తన క్యాబినెట్ తో సహా గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసి రాజీనామా సమర్పించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ), జననాయక్ జనతా పార్టీ (జెజెపి) లమధ్య కొన్నిరోజులుగా చీలికలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే మనోహర్ లాల్ ఖట్టర్, తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే హర్యానా భారతీయ జనాతా పార్టీకి చెందిన బీజేపీ చీఫ్ నయాబ్ సింగ్ సైనీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Aadhaar Cord Update: ఆధార్ కార్డు ఉన్న వారికి మరో గుడ్ న్యూస్.. యూఐడీఏఐ తాజా నిర్ణయం ఇదే..


లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రంలో సీట్ల సర్దుబాటు ఒప్పందం కుదరకపోవడంతో బీజేపీ, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ప్రస్తుతం, 90 మంది సభ్యుల సభలో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉండగా, జెజెపికి 10 మంది ఉన్నారు. పాలక కూటమికి ఏడుగురు స్వతంత్రులలో ఆరుగురి మద్దతు కూడా ఉంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు 30 మంది ఎమ్మెల్యేలు, ఇండియన్ నేషనల్ లోక్ దళ్, హర్యానా లోఖిత్ పార్టీకి ఒక్కో సీటు ఉంది. ఈ రోజు సాయంత్రం కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


కొత్త సీఎం నయాబ్ సింగ్ సైనీ ప్రస్థానమిదే..


ఓబీసీ వర్గానికి చెందిన కురుక్షేత్ర ఎంపీ నయాబ్ సింగ్ సైనీ గతేడాది అక్టోబర్‌లో హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1996లో బీజేపీలో చేరడంతో సైనీ ప్రయాణం ప్రారంభమైంది. హర్యానా బీజేపీ సంస్థాగత ఫ్రేమ్‌వర్క్‌లో ప్రారంభించి, 2000 వరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో కలిసి పనిచేశాడు.  క్రమంగా మెట్టు మెట్టు ఎదుగుతూ.. 2002లో అంబాలాలో బీజేపీ యూత్ వింగ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.  2005లో అంబాలాలో జిల్లా అధ్యక్షునిగా నియమితులయ్యారు.


పార్టీ పట్ల ఆయనకున్న అంకితభావం కారణంగా 2009లో హర్యానాలో BJP కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,  2012లో అంబాలా BJP జిల్లా అధ్యక్షుడితో సహా పలు ముఖ్యమైన పదవులను చేపట్టాడు. 2014లో నారాయణ్‌గఢ్ నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యునిగా ఎన్నికై, 2016లో హర్యానా ప్రభుత్వంలో మంత్రిగా నియమితులైనప్పుడు ఆయన రాజకీయ జీవితం ఒక్కసారిగా ఊపందుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికలలో, నయాబ్ సింగ్ సైనీ తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ (INC)కి చెందిన నిర్మల్ సింగ్‌ను కురుక్షేత్ర నియోజకవర్గం నుండి 3.83 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు.


Read More: Matric Exam Paper Viral: ప్లీజ్ సార్.. నన్ను పాస్ చేయండి.. లేకుంటే పెళ్లి చేస్తారు.. యువతి ఎగ్జామ్ పేపర్ వైరల్


2014లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా కొనసాగిన సైనీ మనోహర్ లాల్ ఖట్టర్‌కు నమ్మకస్తుడిగా పరిగణించబడ్డారు. లోక్‌సభ ఎంపీని హర్యానా బీజేపీ చీఫ్‌గా నియమించేందుకు ఎన్నికల కులాల లెక్కలు కూడా కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కురుక్షేత్ర, యమునానగర్, అంబాలా, హిసార్ ,  రేవారీ జిల్లాల పాకెట్స్‌లో సైనీ కులాల జనాభా హర్యానాలో దాదాపు 8%గా ఉన్నట్లు సమాచారం.




 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter