అత్యాచార ఆరోపణలతో ఆలయ పూజారి అరెస్ట్
హర్యానా పోలీసులు ఫతేహాబాద్‌లోని తొహానా పట్టణానికి చెందిన బాబా అమర్‌పురి అనే ఆలయ ప్రధాన పూజారిని అరెస్టు చేశారు.
హర్యానా పోలీసులు ఫతేహాబాద్‌లోని తొహానా పట్టణానికి చెందిన బాబా అమర్‌పురి అనే ఆలయ ప్రధాన పూజారిని అరెస్టు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడిగా ఉంటున్న ఆయన.. మహిళలను లొంగదీసుకున్న వీడియోలు ఇటీవల ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చాయి. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 'కేసు ఫైల్ చేసి దర్యాప్తు ప్రారంభించాం. అరెస్టు చేసి ఆ ప్రాంతాన్ని సీజ్ చేశాము. అక్కడ నుంచి కొన్ని అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకున్నా్ం' అని పోలీసులు తెలిపారు.
ఓ ప్రముఖ జాతీయ మీడియా కథనం మేరకు, బాబా అమర్‌పురి కనీసం 120 మంది మహిళలపై అత్యాచారాలు చేసి వాటన్నింటినీ తన సెల్‌ఫోన్‌తో చిత్రీకరించాడు. ఆ వీడియో క్లిప్పింగులతో అతను మహిళలను బ్లాక్‌మెయిల్ చేసి లొంగదీసుకున్నాడు. అంతేకాదు..బాబా ఆలయాన్ని జల్లెడపట్టగా 120 వీడియో క్లిప్‌లు దొరికాయని..ఒక్కొక్క వీడియో ఒక్కొక్క మహిళకు చెందినదిగా పేర్కొ్ంది.