Hathras Case: కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ
ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Harthras) లో జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును యూపీ ప్రభుత్వం.. ఇప్పటికే సిట్ (SIT) కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూపీ ప్రభుత్వం (UP Govt) సిఫారసు మేరకు శనివారం కేంద్ర ప్రభుత్వం (Central Govt).. ఈ కేసు దర్యాప్తును సీబీఐ (CBI) కు అప్పగించింది.
Hathras gang-rape case: CBI registers case: న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Hathras) లో జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును యూపీ ప్రభుత్వం.. ఇప్పటికే సిట్ (SIT) కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూపీ ప్రభుత్వం (UP Govt) సిఫారసు మేరకు శనివారం కేంద్ర ప్రభుత్వం (Central Govt).. ఈ కేసు దర్యాప్తును సీబీఐ (CBI) కు అప్పగించింది. ఈ మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆదివారం హత్రాస్ అత్యాచార ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. అయితే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీబీఐ అధికారి ఆర్కే గౌర్ తెలిపారు. Also read: Amitabh Bachchan: 78వ వసంతంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ షెహన్‌షా
అయితే ఈ కేసు ఇప్పటికే పలు మలుపులు తిరిగింది. బాధితురాలు.. నిందితుల్లో ఒకరికి స్నేహితురాలని.. వారిద్దరూ ఫోన్లల్లో సంభాషించుకునేవారని దర్యాప్తులో తేలింది. దీంతోపాటు బాధితురాలి సోదరుడు కూడా అతనితో మాట్లాడినట్లు తెలిసిందే. ఈ క్రమంలో ఈ కేసుపై యూపీ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ను సైతం సమర్పించింది. సుప్రీం పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని సూచించింది. దీంతోపాటు.. బాధితురాలి కుటుంబం, సాక్ష్యులకు రక్షణగా 60 మంది పోలీసులను గ్రామంలో మోహరించి.. 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తోంది. Also read: Hathras Case: ఎస్పీకి లేఖ రాసిన ప్రధాన నిందితుడు.. సంచలన ఆరోపణలు!
ఇదీ కేసు..
సెప్టెంబరు 14న పొలం పని చేస్తున్న 19 ఏళ్ల దళిత యువతిపై ఉన్నత వర్గానికి చెందిన నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, నాలుక కోసి, చిత్రహింసలకు గురిచేశారు. తీవ్రంగా గాయపడిన యువతి రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడుతూ.. ఢిల్లీలోని సప్దర్‌జంగ్ ఆసుపత్రిలో సెప్టెంబరు 29న కన్నుమూసింది. అయితే బాధితురాలి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పజెప్పకుండా, వారిని అనుమతించకుండానే అదేరోజు అర్థరాత్రి 2:30 గంటలకు పోలీసులు దహనం చేశారు. ఆ తరువాత ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతోపాటు విధుల్లో నిర్లక్ష్యం వహించిన హత్రాస్ ఎస్పీతో సహా ఐదుగురుపోలీసు అధికారులను యూపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంతేకాకుండా ఈ కేసుపై సిట్‌ను ఏర్పాటు చేసింది. అయితే సిట్ నివేదికను ఈ నెల 16 న యూపీ ప్రభుత్వానికి సమర్పించనుంది. Also Read: Hathras Case: అందుకే అర్థరాత్రి అంత్యక్రియలు: యూపీ ప్రభుత్వం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe