Lockdown in Bengaluru: కర్ణాటక సర్కార్‌కి కుమారస్వామి హెచ్చరిక
Bengaluru in Lockdown: కర్ణాటక రాజధాని బెంగళూరులో రోజు రోజుకూ పెరుగుతోన్న కరోనావైరస్ పాజిటివ్ కేసులను ( Coronavirus ) కట్టడి చేయడానికి అక్కడి ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ (Lockdown ) విధించింది. బెంగళూరులోని ఐదు ప్రధాన ప్రాంతాల్లో 14 రోజుల లాక్‌డౌన్‌ను సోమవారం నుంచి అమలు చేసింది.

కరోనావైరస్ మహమ్మారి ( COVID-19 Pandemic ) నుంచి బెంగుళూరును రక్షించడానికి కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ( CM Yadiyurappa ) మరోసారి లాక్‌డౌన్‌ను విధించారు. అన్‌లాక్ -1 ను ప్రజలు దుర్వినియోగం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన యడియూరప్ప ఇకపై నిబంధనలను అతిక్రమించేవారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు. ముఖ్యంగా బెంగుళూరులోని దక్షిణ, పశ్చిమ భాగంలో కోవిడ్ -19 ( COVID- 19 ) సంక్రమణ పెరగడంతో స్థానిక మార్కెట్లు పరిసర ప్రాంతాలను పూర్తిగా సీల్ చేశారు.
అయితే దీనిపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీయు ( JDU ) నేత హెచ్.డి కుమారస్వామి ( HD Kumaraswamy ) అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బెంగుళూరు నగరాన్ని పూర్తిగా లాక్‌డౌన్ చేయాలని.. కనీసం ఇరవై రోజులు పూర్తిగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆయన ట్విట్టర్‌లో సూచించారు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే బెంగుళూరు మరో బ్రెజిల్ అవుతుంది అని కూడా ఆయన హెచ్చరించారు. దాంతో పాటు దినసరి కూలీలకు రూ.5000 వేల ఆర్థిక సహాయం చేయాలని కుమార స్వామి డిమాండ్ చేశారు.
కర్ణాటకలో ఇప్పటి వరకు మొత్తం 9,399 కేసులు నమోదు కాగా 142 మంది మరణించారు. సోమవారం రోజు ఐదు మంది మరణించగా ఇందులో ముగ్గురు బెంగుళూరు వాసులే. పరిస్థితి దిగజారుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం రంగంలోకి దిగు సంక్రమణ పెరగకుండా ఉండేందుకు లాక్‌డౌన్ విధించింది.