అసలే కరోనా వైరస్‌తో ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే.. మరోవైపు మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. కోవిడ్19 టెస్టుల సాకుతో ఓ ఆరోగ్య అధికారి నర్సుపై లైంగిక దాడి (Kerala Nurse Sexual Assault)కి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలో ఈ ఘటన చోటుచేసుకుంది. మల్లపురంలో 44 ఏళ్ల మహిళ నర్సుగా సేవలందిస్తోంది. ఇటీవల ఆమె తన స్వస్థలానికి తిరిగొచ్చింది. Gold Rate: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్థానికంగా పనిచేస్తున్న జూనియర్ హెల్త్ ఇన్‌స్పెక్టర్ ఆమెను క్వారంటైన్‌లో ఉండాలని సూచించాడు. ఈ మేరకు యాంటి జెన్ టెస్టులు చేశాడు. కోవిడ్19 రిపోర్టు కోసం బరతనూర్‌లోని తన ఫ్లాట్‌కు రావాలని చెప్పాడు. రిపోర్టుల కోసం ఫ్లాట్‌కు సెప్టెంబర్ 3న వెళ్లగా తనను బంధించి లైంగిక దాడికి పాల్పడ్డాడని, మరుసటి రోజు కట్లు విప్పగా అక్కడి నుంచి బయటపడ్డానంటూ బాధిత నర్సు పోలీసులను ఆశ్రయించింది. AP Unlock 4 Guidelines: ఏపీలో అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదల 



బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం) కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం ఆ జూనియర్ హెల్త్ ఇన్‌స్పెక్టర్‌ను అరెస్ట్ చేశారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. యువతిపై కరోనా అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారం చేయడం, ఇప్పుడు ఏకంగా నర్సుపైనే డాక్టర్ అఘాయిత్యానికి పాల్పడటం సిగ్గుచేటు. ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ప్రతిపక్షనేత రమేష్ ఛెన్నితల మండిపడ్డారు. Isha Koppikar Photos: ‘చంద్రలేఖ’ నటి గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో చూడండి
Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు