తెలంగాణలో అతి భారీ వర్షాలు : వాతావరణ శాఖ హెచ్చరికలు
తెలంగాణలో అతి భారీ వర్షాలు : వాతావరణ శాఖ హెచ్చరికలు
న్యూఢిల్లీ: ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 30న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఆ అల్పపీడనం కాస్తా తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. ఫలితంగా సోమవారం నుంచి బుధవారంలోగా నైరుతి రుతుపవనాలు దేశంలోని అన్ని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వాతావరణం మార్పు కారణంగా నేడు, రేపు, ఎల్లుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారులు.. ఆ తర్వాత వాయు గుండం ప్రభావంతో జూలై 2న తెలంగాణలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భారత వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం తెలంగాణతోపాటు ఒడిషా, దక్షిణ చత్తీస్‌ఘడ్, విదర్భ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.