Heavy Reains In Delhi: ఢిల్లీలో గత కొన్ని గంటలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కూడా భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి వర్షానికి పలు ప్రాంతాలు జలమయ్యమయ్యాయి. సబ్జీ మండి ప్రాంతంలో  ఓ భవనం కుప్పకూలింది. భవనం కింద చాలా మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న  అగ్నిమాపక శాఖ ఘటనాస్థలానికి చేరుకుంది. ఈ ఘటన కు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అటు బుధవారం కురిసిన భారీ వర్షానికి సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ అబ్జర్వేటరీలో ఒక గంట వ్యవధిలోనే 112.5 మి.మి వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. పలు చోట్ల నడుములోతు నీరు నిలిచింది. దీంతో అనేక చోట్ల ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.  ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీకి రావాల్సిన పలు విమానాలను దారి మళ్లించినట్లు వార్తలు వస్తున్నాయి. రోడ్లపైకి మోకాల్లోతు నీళ్లు రావడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 


Read Also: Constable Aspirants: అర్ధరాత్రి మళ్లీ నిరుద్యోగుల ఆందోళన.. దిల్‌సుఖ్‌నగర్‌ దిగ్బంధం


మరోవైపు రావూస్ అకాడమీలో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మరణించిన సంగతి తెలిసిందే. వారి మ్రుతికి నిరసనగా ఓల్డ్ రాజేందర్ నగర్ లో సివిల్స్ అభ్యర్థులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. 


Read Also: First cry IPO: మార్కెట్లోకి ఫస్ట్ క్రై ఐపీఓ..ప్రారంభం ఎప్పుడంటే..?
 


 


 


 




 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి