మధుర: ఎన్నికల ప్రచారం చేసే సమయంలో అభ్యర్థులు వివిధ ఫీట్స్ చేస్తూ కనిపించడం ప్రతీ ఎన్నికల్లో కనిపించేదే. హోటల్‌కి వెళ్లి దోశలు వేయడం, సెలూన్‌కి వెళ్లి షేవింగ్ చేయడం, చిన్నపిల్లలను ఎత్తుకుని ముద్దులు పెట్టడం వంటి సీన్స్ అన్ని ఎన్నికల ప్రచారంలో కనిపిస్తుంటాయి. అదేవిధంగా ఉత్తర్ ప్రదేశ్‌లోని మధుర లోక్ సభ స్థానం నుంచి బీజేపి అభ్యర్థిగా పోటీచేస్తోన్న హేమామాలిని కూడా గోవర్థన్‌లో జరిగిన ప్రచారంలో జనంతో మమేకమైపోవడమే కాకుండా అక్కడ ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తూ కనిపించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"177829","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


బాలీవుడ్ డ్రీమ్ గాళ్‌గా పేరొందిన హేమా మాలిని ప్రస్తుతం మధుర నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా బీజేపి ఆమెకే టికెట్ కేటాయించడంతో మరోసారి ఆమె ఎన్నికల బరిలో నిలిచి ప్రచారంలో బిజీ అయ్యారు.