Himachal Pradesh Floods: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాదిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. హిమాచల్ ప్రదేశ్‌తోపాటు పంజాబ్, రాజస్థాన్, జమ్మ కశ్మీర్‌ రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 20 మంది మరణించారు. ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తుండగా.. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో పలు చోట్ల రోడ్లు మొత్తం క్లోజ్ అవ్వగా.. మరికొన్ని చోట్ల రహదారులు తెగిపోయాయి. రవాణా సౌకర్యం లేకపోవడంతో వివిధ ప్రాంతాల్లో ప్రజలు చిక్కుకుపోయారు. మరోవైపు బియాస్ నది నీటిమట్టం పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు. బిలాస్‌పూర్, సోలన్, సిమ్లా, సిర్మౌర్, ఉనా, హమీర్‌పూర్, మండి, కులు తదిరత ప్రాంతాల్లో సోమవారం వర్షాలు కురిశాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. నదులు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. 


ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో బియాస్ నది ఉప్పొంగింది. దీంతో మండిలోని పంచవక్త్ర ఆలయం నీటిలో మునిగిపోయింది. ఆదివారం నదిలో నీటిమట్టం పెరగడంతో మండిలోని పంచవక్త్ర బ్రిడ్జ్ కూలిపోయింది. ఇక మనాలిలో ఓ బస్సు వరద నీటిలో కొట్టుకుపోయింది. ఇందుకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా మనాలిలోని అల్లు అనే హోటల్ కొట్టుకుపోయింది. బియాస్ నదిలో వరద ఉధృతి మరింత పెరిగిందని అధికారులు చెబుతున్నారు. 


భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు సూచిస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితికి హెల్ప్‌లైన్ నంబర్‌లు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు సిమ్లా-కల్కా మధ్య అన్ని రైళ్లను నేడు, రేపు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్‌పై కొండచరియలు విరిగిపడ్డాయని.. వరద నీరు నిలిచిపోయిందని చెప్పారు.


Also Read: Delhi Floods Alert: దేశ రాజధానికి వరద ముప్పు, ప్రమాదస్థాయికి చేరుకున్న యమునా నది


Also Read: YS Sharmila: ఊరు గొప్ప.. పేరు దిబ్బ.. దొర గారి డ్రీమ్డ్ ప్రాజెక్ట్ కాళేశ్వరం దుస్థితి: వైఎస్ షర్మిల  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి