Himachal Pradesh Temple Collaps News: హిమాచల్ ప్రదేశ్‌లో రుత పవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తమైంది. తాజాగా మరో ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. రాజధాని సిమ్లా సమ్మర్‌హిల్‌లోని ఓ శివాలయంపై కొండచరియలు విరిగిపడడంతో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్కడ నేడు శ్రావణ మాసం సోమవారం భక్తులు శివాలయానికి పూజలు నిర్వహిచేందుకు తరలివచ్చారు. ఈ సమయంలోనే కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రమాదం సమయంలో ఆలయంలో 50 మంది వరకు ఉండొచ్చని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 9 మంది మృతదేహాలను వెలికితీశారు. 


శివాలయం కుప్పకూలిన ఘటనపై హిమాచల్ ప్రదేశ్‌ సీఎం సఖ్వీందర్‌ సింగ్‌ సుఖు స్పందించారు. 9 మంది మరణించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక యంత్రాంగం శిథిలాలను తొలగించేందుకు తీవ్రంగా కృషి చేస్తోందని ట్వీట్ చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నట్లు తెలిపారు. 


ఇదిలా ఉండగా.. హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో ఒక గ్రామంలో పిడుగుపాటుకు ఏడుగురు మరణించారు . ఈ సంఘటన ఆదివారం అర్థరాత్రి జాదోన్ గ్రామంలో చోటుచేసుకుంది. మరో ఆరుగురిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి రోడ్లపై పడ్డాయి. దీంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. 


సిమ్లా-చండీగఢ్ ప్రధాన రహదారితోపాటు పలు మార్గాలను క్లోజ్ చేశారు. ఆదివారం సోలన్‌లోని కోటి సమీపంలోని చక్కి మోర్ వద్ద రహదారికి ఇరువైపులా పెద్ద సంఖ్యలో భారీ వాహనాలు నిలిచిపోయాయి. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలను ఆగస్టు 14 వరకు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. హమీర్‌పూర్‌లోని అన్ని ప్రాంతాలలో పంట దెబ్బతిన్నాయి. ప్రజలు బయటకు వెళ్లవద్దని.. బియాస్ నదీ తీరం, నుల్లాల దగ్గరకు వెళ్లవద్దని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది.


Also Read: Ind Vs WI 5th T20 Highlights: మోస్ట్ ఓవర్‌రేటెడ్ ప్లేయర్.. హార్థిక్ పాండ్యాను ఆడుకుంటున్న ఫ్యాన్స్  


Also Read: Independence Day 2023: హైదరాబాద్ వాసులకు ముఖ్యగమనిక.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి