Hindustan Shipyard Jobs: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు కొలువుదీరనున్నాయి. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కీలక విభాగంలో ఉన్నత స్థాయి ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు వెంటనే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విశాఖపట్నంలోని భారత రక్షణ మంత్రిత్వశాఖ(Union Defence Ministry)కు చెందిన హిందూస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో(Hindustan Shipyard limited)ఉన్నతస్థాయి ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి దరఖాస్తులకు నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 53 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఇందులో శాశ్వత ప్రాతిపదికన 18, కాంట్రాక్ట్ బేసిస్‌లో 31, ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్‌లో 4 పోస్టుల్ని భర్తీ చేయబోతున్నారు. 


శాశ్వత ప్రాతిపదికన జనరల్ మేనేజర్, అడిషనల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.హెచ్ఆర్, టెక్నికల్, ఫైనాన్స్ విభాగాల్లో ఈ పోస్టులున్నాయి. గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ ఉత్తీర్ణత అర్ఙతగా ఉండి తగిన అనుభవముండాలి. ఇక కాంట్రాక్ట్ ప్రాతిపదికన డిప్యూటీ ఛీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ మేనేజర్, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అగ్యుమెంటేషన్, ఎస్ఐపీ, ఏబీఏపీ డెవలపర్, సబ్‌మెరైన్ టెక్నికల్ విభాగాల్లో ఉన్నాయి. వీటికి ఇంజనీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ లేదా ఎంటెక్ అర్ఙతగా ఉండి తగిన అనుభవముండాలి. ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్ పోస్టులు టెక్నికల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అగ్యుమెంటేషన్, ఈకేఎం ప్లానింగ్ అండ్ సబ్‌మెరైన్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఉన్నాయి. సంబంధిత అంశంలో ఇంజనీరింగ్ డిప్లొమా అర్హతగా ఉండి తగిన అనుభవముండాలి. 


గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆన్‌లైన్ విధానం(Online Recruitment)లో ఎంపిక ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఆగస్టు 30 చివరితేదీగా ఉంది. మరిన్ని వివరాలకు, ఆన్‌లైన్ దరఖాస్తుకు  www.hslvizag.in సంప్రదించాలి. 


Also read: EU Vaccine Passport: ఈయూ వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ వ్యవహారం, ఇండియా - ఈయూ మధ్య పెరుగుతున్న వివాదం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook