Historical Gold Coins: కోట్ల విలువైన బంగారు నాణేలు, వివాదంతో బయటకు పొక్కిన వైనం
Historical Gold Coins: పేచీకు పోకుండా ఉంటే గుట్టుచప్పుడు కాకుండా ఉండేది. కోట్ల రూపాయల విలువైన గుప్త నిధులు దక్కేవి. ఆశకు హద్దుండదు కదా. వివాదమైంది. పోలీసుల చేతికి చిక్కింది. ఎక్కడో తెలుసా..
Historical Gold Coins: పేచీకు పోకుండా ఉంటే గుట్టుచప్పుడు కాకుండా ఉండేది. కోట్ల రూపాయల విలువైన గుప్త నిధులు దక్కేవి. ఆశకు హద్దుండదు కదా. వివాదమైంది. పోలీసుల చేతికి చిక్కింది. ఎక్కడో తెలుసా..
బంగాలు నిధులన్నీ అక్కడక్కడా తెలియని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ గుప్తంగా ఉన్నాయనడానికి నిదర్శనమే మహారాష్ట్ర(Maharashtra)లో వెలుగు చూసిన ఘటన. శతాబ్దాల నాటి బంగారు నాణేలు బయటపడ్డాయి. నిర్మాణ పనుల్లో తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ వ్యవహారమది. ఆశకు కళ్లెం వేసి..పేచీకు పోకుండా ఉంటే గుట్టు చప్పుడు కాకుండా ఉండేది. కానీ అలా జరగదు కదా. అందులో బంగారు నాణేలు మరి. వివాదమైంది పోలీసులు చేతికి చిక్కింది ఆ సంపదంతా.
మహారాష్ట్రలోని పింప్రి ప్రాంతం సమీపంలో చిక్లిలో నిర్మాణపనులకు వెళ్లారు సద్దాం, అతని మామైన ముబారక్ షేక్, బావమరిది ఇర్ఫాన్‌లు. ఇంటి పనుల కోసం తవ్వకాలు జరుపుతుండగా బంగారు నాణేలు బయటపడ్డాయి. అంతే ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకున్నారు. మొత్తం 216 బంగారు నాణేలవి. ఒక్కో నాణెం కనీసం 60 నుంచి 70 వేలుంటుందని అంచనా. మొత్తం బరువు 2 వేల 357 గ్రాములు. ఈ నాణేలు క్రీస్తుశకం 1720-1750 నాటివని తెలుస్తోంది. మొత్తం విలువ 1.3 కోట్లకు పైగా ఉంటుంది. ముగ్గురూ కలిసి పంచుకునే క్రమంలో విబేధాలు తలెత్తడంతో విషయం కాస్తా బయటకు పొక్కింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో బంగారు నాణేలు(Gold Coins) బయటపడ్డాయి.
బంగారు నాణేలపై రాజా మహ్మద్ షా పేరు ఉర్దూ, అరబిక్ భాషల్లో ముద్రించి ఉందని పురావస్తు అధికారులు తెలిపారు. పోలీసులు బంగారు నాణేల్ని పురావస్తు శాఖ (Archeology Department) అధికారులకు అప్పగించగా..పురావస్తు శాఖ పరిశోధనలు చేపట్టింది. తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. వివాదం తలెత్తకుండా పంచుకుని ఉంటే..గుట్టు చప్పుడు కాకుండా ఉండేది. బంగారు నాణేలు దక్కి ఉండేవేమో. కానీ నిజం ఆగదు కదా. బయటకు పొక్కేసింది.
Also read: Made in india vaccine: కెనడా రోడ్లపై థ్యాంక్యూ ఇండియా, పీఎమ్ నరేంద్ర మోదీ బోర్డులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook