'కరోనా వైరస్' ఉద్దృతంగా విస్తరిస్తున్న క్రమంలో.. భారత దేశంపై నిత్యం కుట్రలు, కుతంత్రాలతో రగిలిపోతున్న దాయాది దేశం పాకిస్తాన్‌కు ఇదే అదను దొరికింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్కడి ఉగ్రవాదులను జమ్మూకాశ్మీర్ సరిహద్దు గుండా ఉసిగొల్పుతోంది. మొన్నటికి మొన్న ఐదుగురు ఆర్మీ సిబ్బంది ప్రాణాలు తీశాయి ముష్కర మూకలు. ఇప్పుడు మరోసారి భారత ఆర్మీపై పేట్రేగేందుకు వ్యూహాలు రచించాయి. ఐతే భారత ఆర్మీ జవాన్లు దీనికి ధీటుగా సమాధానమిచ్చారు. 


నిన్న అర్ధరాత్రి నుంచి జమ్మూ కాశ్మీర్ అవంతిపురా జిల్లాలోని బీగ్పూరాలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ముగ్గురు ముష్కరులను భారత ఆర్మీ జవాన్లు మట్టుబెట్టారు. ఇందులో పాకిస్తాన్ లోని ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ రియాజ్ నైకూ హతమయ్యాడు. రియాజ్ నైకూ గత కొద్దికాలంగా జమ్మూ కాశ్మీర్‌లోని బీగ్పూరాలో తిష్ట వేసుకుని కూర్చున్నాడు. అతన్ని పట్టుకోవడానికి ఇన్నాళ్లూ భారత ఆర్మీ చాలా ప్రయత్నాలు చేసింది. కానీ మంగళవారం అర్ధరాత్రి అతడు ఉన్న ఇంటిని ట్రాప్ చేశారు ఆర్మీ సిబ్బంది. బుధవారం   తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంటర్‌లో రియాజ్ నైకూ ప్రాణాలు కోల్పోయాడు. 


ఎవరీ రియాజ్ నైకూ..?
రియాజ్ నైకూ.. ప్రస్తుతం పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ  హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇతన్ని పట్టుకునేందుకు భారత ఆర్మీ బలగాలు విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో గత 8 ఏళ్ల నుంచి యాక్టివ్‌గా హిజ్బుల్ ముజాహిదీన్ కోసం పని చేస్తున్నాడు. ఇతని తలపై 12 లక్షల రూపాయల రివార్డ్ కూడా ఉంది. భారత ఆర్మీ, సీఆర్పీఎఫ్ హిట్ లిస్ట్‌లో కూడా ఉన్నాడు. హిజ్బుల్ ముజాహిదీన్‌లో రియాజ్ నైకూ పోస్టర్ బాయ్‌గా చేరాడు. ఆ తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ వచ్చాడు.  2016  జులై 8న జరిగిన ఎన్ కౌంటర్‌లో కమాండర్ బురాన్ వానీ హతమైన తర్వాత చాలా యాక్టివ్ అయ్యాడు. చివరకు ఈ రోజు ఎన్ కౌంటర్‌లో హతమయ్యాడు. 
 
రియాజ్ నైకూతోపాటు అతని సహచరున్ని కూడా ఆర్మీ బలగాలు మట్టుబెట్టాయి. మరోవైపు పుల్వామా జిల్లాలోని శార్షిలీ గ్రామంలో జరిగిన మరో ఎన్ కౌంటర్‌లో  మరో ఉగ్రవాది హతమయ్యాడు..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..