HMPV New Cases In Chennai: ఇద్దరు చిన్నారులకు సోకిన చైనా వైరస్.. భయాందోళనలో ప్రజలు..!
HMPV Cases: కరోనా మహమ్మారి తరువాత.. ఇప్పుడు మళ్లీ కొత్త చైనా వైరస్.. అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. హెచ్ఎంపివి అనే ఈ వైరస్ కేసులు ఇప్పటికే ఇండియాలో నాలుగు నమోదు కాగా.. వీటిల్లో రెండు బెంగుళూరు కి సంబంధించిన కేసులు కావడం గమనర్హం. ఇక మరో పక్క చెన్నైలో మొదటి రెండు కేసులు కాసేపటి ముందే నమోదయ్యాయి.
HMPV New Cases: 2020 లో కరోనా మహమ్మారి ఎంతలా విజ్రుమించి..ప్రాణ నష్టాన్ని కలిగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ ప్రజలు.. ఆ భయం నుంచి తేలుకోలేదని చెప్పాలి. ముఖ్యంగా సెకండ్ వేవ్ వచ్చినప్పుడు పిట్టలా రాలిపోయారు.. ప్రజలు. కనీసం ఖననం చేయడానికి కూడా స్థలం లేకపోవడంతో.. చాలామంది మృతదేహాలను అలాగే వదిలేసేన పరిస్థితులు కూడా మనం చూసాం.. భగవంతుడా జీవించి ఉన్నంతకాలం ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకూడదు అని ప్రార్థించిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి.
అయితే ఇలాంటి ఘటనలు ఇంకా మరువకముందే.. ఇప్పుడు చైనా నుంచి మరొక వైరస్ భారత్ లోకి ప్రవేశించింది. అప్పుడు కూడా కరోనా వైరస్ చైనా నుంచి వచ్చింది. ఇప్పుడు ప్రజలు భయపడుతున్నట్లుగానే.. చైనాలో విపరీతంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ భారత్ లోకి కూడా ప్రవేశించింది. సోమవారం బెంగళూరులో 8 నెలల చిన్నారికి ఈ వ్యాధి లక్షణాలు కనిపించడంతో.. వెంటనే అప్రమత్తమైన డాక్టర్లు.. ఆ చిన్నారితో పాటు..మరో చిన్నారి కి సంబంధించిన నమూనాలను కూడా తీసుకొని పరీక్షలు నిర్వహించారు.
కాగా వారికి సోకింది చైనా హెచ్ఎంపీవీ వైరస్ అని వైద్యులు నిర్ధారించారు. అయితే ఇద్దరు చిన్నారులకు ఎటువంటి అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన రికార్డు లేకపోయినప్పటికీ.. ఈ వైరస్ ఎలా సోకింది అనేదానిపై ఆందోళన ఏర్పడింది. ఇక ఆ తర్వాత కోల్కత్తాలో కూడా ఒక కేసు నమోదు అయింది. ఇప్పుడు చెన్నైలో రెండు కేసులు నమోదైనట్లు సమాచారం. ఇద్దరు చిన్నపిల్లలు చెన్నై హాస్పిటల్ లో.. జ్వరం, జలుబు అని అడ్మిట్ కావడంతో.. వారికి పరీక్షలు చేయగా.. ఇది హెచ్ఎంపీవి..వైరస్ అని తేల్చి చెప్పారు వైద్యులు.
ఇకపోతే భారత్ లోకి చైనా కొత్త వైరస్ ఎంటర్ కావడంతో.. దేశ ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు. ముఖ్యంగా హెచ్ఎంటీవీ వైరస్ని 2001లోనే గుర్తించారు.. ఇక ఆ వైరస్ లక్షణాల విషానికి వస్తే ఫ్లూ, ఇతర శ్వాస కోసం ఇన్ఫెక్షన్స్ మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు. ముక్కుదిబ్బడ జ్వరం దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయట. ఇక వైరస్ తీవ్రత ఎక్కువ అయ్యే కొద్దీ.. బ్రాంకైటిస్, నిమోనియా.. వంటి వ్యాధులకు దారి తీయవచ్చని వైద్యులు తెలుపుతున్నారు.
ముఖ్యంగా వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి మూడు నుండి ఆరు రోజుల సమయం కూడా పడుతుందట. ముఖ్యంగా అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం చిన్నారులు వృద్ధులు అలాగే బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగి ఉన్న వ్యక్తులు.. దీని బారిన పడే అవకాశం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ వ్యాప్తిని అరికట్టడానికి చేతులు శుభ్రంగా కడుకోవాలని అనారోగ్యం ఉన్నవారికి దూరంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు.
Also Read: China Virus: తస్మాత్ జాగ్రత్త.. భారత్ లో అడుగెట్టిన చైనా వైరస్.. తొలి కేసు నమోదు..
Also Read: Game Changer: గేమ్ చేంజర్ ఈవెంట్‌లో అపశ్రుతి.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దిగ్భ్రాంతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.