ఢిల్లీలో మరో ప్రమాదం జరిగింది.  అకస్మాత్తుగా ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటన చిత్తరంజన్ పార్క్ వద్ద జరిగింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు లోపల చిక్కుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి  సమాచారం ఇచ్చారు. దీంతో  అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది.. శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులను లోపల నుంచి బయటకు తీసేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఐతే లోపల ఇద్దరే ఉన్నారా ..? లేక మరెవరైనా ఉన్నారా .. ? అనే విషయం తెలియాల్సి ఉంది.


[[{"fid":"182070","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


శిథిలాలను తొలగించడానికి జేసీబీలను ఉపయోగిస్తున్నారు. ఐతే ఇనుప చువ్వలను తొలగించేందుకు సమయం పడుతోంది. దీంతో వాటిని వెల్డింగ్ ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.  


మరోవైపు సంఘటన ఎలా జరిగింది..? కుప్ప కూలిన భవనం పురాతన భవనమా ..? ప్రమాదానికి కారణాలేంటనేది తెలియాల్సి ఉంది.