Sim Cards Misuse: దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎప్పుడు ఏ రూపంలో మోసాలు జరుగుతాయో తెలియని పరిస్థితి. ముఖ్యంగా మీకు తెలియకుండా మీ ఆధార్ కార్డుతో సిమ్ కార్డులు తీసుకుని అసాంఘిక కార్యక్రమాలకు లేదా ఆన్‌లైన్ మోసాలకు పాల్పడే ఘటనలు ఎక్కువౌతున్నాయి. ఈ నేపధ్యంలో మీ పేరున ఎన్ని సిమ్ కార్డులు వినియోగింలో ఉన్నాయో తెలుసుకోవడం చాలా అవసరం. అదెలాగో పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆన్‌లైన్ చెల్లింపుల యుగంలో సిమ్ కార్డు అత్యంత కీలకమైంది. సైబర్ మోసాలు మొదలయ్యేది వీటితోనే. మీకు తెలియకుండా మీ ఆధార్ కార్డుతో సిమ్ కార్డులు తీసుకునే ప్రమాదముంది. ఈ సిమ్ కార్డుల్ని ఆన్‌లైన్ మోసాలకు లేదా అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించవచ్చు. తద్వారా మీరు ప్రమాదంలో పడతారు. అయితే ఈ పరిస్థితిని నివారించవచ్చు. మీ పేరున ఎన్ని మొబైల్ నెంబర్లు ఉన్నాయో చెక్ చేయవచ్చు. దీనికోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకం ఓ ఆన్‌లైన్ పోర్టల్ ప్రారంభించింది. ఈ పోర్టల్ సహాయంతో మీ పేరున ఎన్ని ఫోన్ నెంబర్లు రిజిస్టర్ అయ్యాయో తెలుసుకోవచ్చు. క్షణాల్లో తెలిసిపోతుంది. 


ముందుగా https://tafcop.sancharsaathi.gov.in/telecomUser ఓపెన్ చేయాలి. ఇప్పుడు స్క్రీన్‌పై కన్పించే బాక్స్‌లో మీ మొబైల్ నెంబర్ , క్యాప్చా ఎంటర్ చేస్తే మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేయగానే మీ పేరుతో రిజిస్టర్ అయున్న మొబైల్ నెంబర్లు వరుసగా ఎన్ని ఉంటే అన్నీ కన్పిస్తాయి. ఆ నెంబర్లు మీకు తెలిసే తీసుకున్నారా లేదా చెక్ చేసుకోండి. ఏదైనా నెంబర్ విషయంలో అనుమానముంటే అక్కడ 3 ఆప్షన్లు కన్పిస్తాయి. ఇది నా నెంబర్ కాదు, చర్యలు అవసరం, చర్యలు అవసరం లేదు అని ఉంటుంది. అనుమానమున్న నెంబర్ ఎదురుగా నా నెంబర్ కాదు అనేది క్లిక్ చేస్తే మీ పేరున ఉన్న ఆ నెంబర్ డీయాక్టివేట్ అవుతుంది. 


మరిక ఆలస్యమెందుకు.. మీ పేరున కూడా వేరే నెంబర్లు ఏమైనా రిజిస్టర్ అయున్నాయో లేదో వెంటనే చెక్ చేసుకోండి.


Also read: 8th Pay Commisson: ఉద్యోగుల పంట పండినట్టే, 8 వేతన సంఘం, కోవిడ్ బకాయిలపై బడ్జెట్‌లో ప్రకటన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook