Vote Casting Tips: ఓటు సరిగ్గా పడిందో లేదో ఎలా తెలుస్తుంది, ఈ జాగ్రత్తలు పాటించండి
How to Caste Your Vote: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ పోలింగ్ జరగనుంది. దేశంలో 18వ లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇవాళే జరగనున్నాయి. ఐదేళ్లకోసారి పాలకుల్ని ఎన్నుకునే అవకాశమిది. అందుకే ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకోవడమే కాకుండా మీరు వేసిన ఓటు సరిగ్గా పడిందో లేదో కూడా చెక్ చేసుకోవాలి.
How to Caste Your Vote: తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలు, ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. హోరాహోరీ పోరు నెలకొన్న నేపధ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు అన్ని ప్రయత్నాలు చేశాయి. ఇక మిగిలింది ఈవీఎంలలో ఓటరు తన తీర్పును నిక్షిప్తం చేయడమే. ఓటు వేసే సమయంలో ప్రతి ఓటరు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. లేకపోతే మీ ఓటు వృధా అయ్యే ప్రమాదం లేకపోలేదు.
పోలింగ్ బూత్‌లో ప్రవేశించాక ముందుగా మీ దగ్గరున్న ఓటర్ స్లిప్పును చూపించి ఓటర్ పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్, ఇతర వివరాలు సరిగా ఉన్నాయో లేవో చూసుకోవాలి.అన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్నాక పోలింగ్ అధికారి మీ ఎడమ చూపుడు వేలికి సిరా ఇంకుతో గుర్తు వేస్తారు. దీనర్ధం మీరు ఓటేసినట్టే. ఆ తరువాత ఓటరు జాబితాలో సంతకం, వేలిముద్ర తీసుకుంటారు.
తరువాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంపార్ట్‌మెంట్‌లో ఓటు వేయాల్సి ఉంటుంది. కంపార్ట్‌మెంట్‌లో ఈవీఎంతో పాటు వీవీ ప్యాట్ కూడా ఉంటుంది. మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో ఆ గుర్తు పేరు సరిచూసుకుని బ్లూ కలర్ బటన్ నొక్కాలి. కనీసం 7 సెకన్లు ప్రెస్ చేస్తే వచ్చే బీప్ సౌండ్‌తో మీరు ఓటు వేసినట్టు ధృవీకరణ అవుతుంది. అదే సమయంలో పక్కనున్న వీవీప్యాట్ మెషీన్‌పై గ్రీన్ లైట్ వెలిగి స్లిప్ కన్పిస్తుంది. ఆ స్లిప్‌లో ఎవరికి ఓటు వేశారో వారి పేరు, గుర్తు, సీరియల్ నెంబర్ కన్పిస్తాయి. ఆ తరువాత ఆ స్లిప్ బాక్స్‌లో పడిపోతుంది. ఈ మొత్తం ప్రక్రియలో ఏది జరగకపోయినా అక్కడే ఉన్న పోలింగ్ అధికారుల్ని సంప్రదించాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook