Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరానికి ఎలా చేరుకోవాలి..? హరతి టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి..? వివరాలు ఇవిగో..
How to Reach Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి పకడ్భందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్య రాముడి సంపోక్షణ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి రానున్నారు.
How to Reach Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరాన్ని ప్రారంభోత్సవ మహోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి భారీ ఎత్తున అయోధ్యకు చేరుకునేందుకు రెడీ అవుతున్నారు. జనవరి 22న అయోధ్య రామమందిరంలోని శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నారు. మీరు కూడా అయోధ్యకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నట్లయితే.. విమానాలు, బస్సులు, రైళ్లు, ఇతర వాహనాల ద్వారా వెళ్లిపోవచ్చు. ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు జనవరి 16న ప్రారంభం కానుండగా.. రాముడికి పట్టాభిషేకం జనవరి 22న జరగనుంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రంలో హరతి కోసం బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో పాసులు బుక్ చేసుకోవచ్చు. హరతి కోసం ముందుగానే స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
ఇక అయోధ్యకు చేరుకునేందుకు అనేక రాష్ట్రాలతో కనెక్టివిటీ ఉంది. విమానాల ద్వారా వచ్చే ప్రయాణికులు.. విమానాశ్రయం నుంచి సులభంగా ట్యాక్సీ బుక్ చేసుకుని ఆలయానికి చేరుకోవచ్చు. రైలు ద్వారా వచ్చే ప్రయాణికులు అయోధ్యలోని రెండు రైల్వే స్టేషన్లలో దిగవచ్చు. ఫైజాబాద్ జంక్షన్, అయోధ్య జంక్షన్ స్టేషన్లు ఉన్నాయి. మన దేశంలోని నలుమూలల నుంచి రైళ్లు ఈ స్టేషన్లకు రాకపోకలు సాగించేందుకు వీలుంది. ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకుని.. ఈ రెండు స్టేషన్లకు చేరుకోవచ్చు. అయోధ్య రామమందిరానికి బస్సుల ద్వారా కూడా చేరుకోవచ్చు. అయోధ్య జాతీయ రహదారులకు దగ్గరగా ఉంటుంది. ఏదైనా బస్ బుకింగ్ యాప్ ద్వారా ఈజీగా బస్ బుక్ చేసుకుని చేరుకోవచ్చు.
హరతి కోసం టికెట్ ఇలా బుక్ చేసుకోండి..
==> ముందుగా srjbtkshetra.org శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
==> మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి.. OTPతో ధృవీకరించడం ద్వారా లాగిన్ అవ్వండి.
==> హోమ్ పేజీలో హరతి విభాగాన్ని సెలక్ట్ చేసుకోండి.
==> మీరు ఏ రోజు హాజరు కావాలనుకుంటున్నారో ఆ తేదీ, హరతి రకాన్ని ఎంచుకోండి.
==> మీ పేరు, చిరునామా, ఫోటో, మొబైల్ నంబర్‌తో సహా అవసరమైన సమాచారాన్ని ఎంటర్ చేయండి.
==> మీరు ఆలయం వద్దకు చేరుకున్న తరువాత మీకు ఇచ్చిన కౌంటర్ నుంచి పాస్‌లను తీసుకుని.. హరతి కార్యక్రమంలో పాల్గొనండి.
రోజంతా మూడు హరతులు ఉంటాయి. ఒక్కో హరతి ప్రత్యేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఉదయం ఆరు గంటలకు శృంగార్ హరతి, మధ్యాహ్నం 12 గంటలకు భోగ్ హరతి, సాయంత్రం 7.30 గంటలకు సంధ్యా హరతి ఉంటుంది. హరతిలో పాల్గొనేందుకు కేవలం 30 మందికి అవకాశం ఉంటుంది. పాస్‌లు కచ్చితంగా ఉండాలి. రాముడి ఆలయ సంప్రోక్షణ జనవరి 22న కాశీ నుంచి వేద పండితులు సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రాముడు మధ్యాహ్నం 12:15 నుంచి 12:45 గంటల మధ్య ఆలయంలో ఆశీనులవుతారు.
Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు
Also Read: Home Loan Rates: హోమ్ లోన్స్ గుడ్ న్యూస్..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook