New coronavirus strain: బ్రిటన్ నుంచి విస్తరిస్తున్న కొత్త కరోనా వైరస్ ఆందోళన కల్గిస్తోంది. ఇండియాలో సైతం ఆరు కేసులున్నట్టు నిర్ధారణ కావడంతో కలవరం కల్గిస్తోంది. అయితే అంత ప్రమాదకరమా కాదా అనే విషయంలో స్పష్టత వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


యూకే ( UK ) లో వెలుగు చూసిన కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ ( New Coronavirus strain ) గురించే ఇప్పుడంతా చర్చ నడుస్తోంది. యూకే నుంచి ప్రారంభమై ఇప్పటికే పలు దేశాలకు విస్తరించింది. పాత కరోనా వైరస్ ( Coronavirus ) ‌తో పోలిస్తే..సంక్రమణ వేగంగా ఉంటుందనడంతో ఆందోళన ఎక్కువవుతోంది. బ్రిటన్ ( Britain ) నుంచి ఇండియాకు తిరిగొచ్చిన 33 వేల మందిలో 114 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా..కొత్త స్ట్రెయిన్ ఉన్నదీ లేనిదీ నిర్ధారించుకోడానికి సీసీఎంబీ ( CCMB ), నిమ్‌హాన్స్ ( Nimhans ), ఎన్ఐవీ ( NIV ) సంస్థల్లో తదుపరి పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో 114మందిలో ఆరుగురిలో కొత్త స్ట్రెయిన్ ఉన్నట్టు తేలింది. 


అయితే కొత్త కరోనా స్ట్రెయిన్ గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ సీసీఎంబీ శుభవార్త అందించింది. యూకే స్ట్రెయిన్ ( Uk Strain ) అంత ప్రమాదకరం కాదని సీసీఎంబీ వెల్లడించింది. కానీ విస్తరణ వేగంగా ఉందని చెప్పింది. ఈ స్ట్రెయిన్‌ను B.1.1.7  రకమని స్పష్టం చేసింది. బ్రిటన్ స్ట్రెయిన్‌కు 71 శాతం వేగంగా వ్యాపించే శక్తి ఉందని...17 రకాల ఉత్పరివర్తనాలు కలిగి ఉందని పేర్కొంది. 


Also read: FASTag: ఫాస్టాగ్‌పై సందేహాలున్నాయా..ఫాస్టాగ్ ఎలా పని చేస్తుంది..ఎలా తీసుకోవాలి