Jubilee Hills Gang Rape: హైదరాబాద్ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో రోజుకో సంచలనం బయటపడుతోంది. విచారణ జరుగుతున్నకొద్ది కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. అత్యాచారానికి ప్రేరేపించిన పరిస్థితులపై తాజా విచారణలో నిందితులు సంచలన విషయాలు వెల్లడించారు. ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్‌లలో సన్నివేశాలే తమకు ప్రేరణ అని ఇద్దరు నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముగ్గురు మైనర్లు పోలీస్ కస్టడీలో ఉండగా.. వీరిలో ఒకరు ఘటనపై నోరు విప్పట్లేదని సమాచారం. మిగతా ఇద్దరు పోలీసులతో మరిన్ని విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా బయటకు వెల్లడైన వివరాల ప్రకారం.. పరీక్షలు ముగిశాక ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్న నేపథ్యంలో దాదాపుగా ప్రతీరోజు పబ్‌లకు వెళ్లడం నిందితులకు అలవాటుగా మారింది. ఘటన జరిగిన మే 28న అమ్నీషియా పబ్‌కి వెళ్లగా.. అక్కడ ఇద్దరు బాలికలను పరిచయం చేసుకున్నారు. ఆ ఇద్దరు నవ్వుతూ మాట్లాడటంతో వారిని ట్రాప్ చేయాలనుకున్నారు. ఈ క్రమంలో ఒక బాలికతో మాటలు కలిపి ఆమెను నమ్మించి వెంట తీసుకెళ్లారు. ఆపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. నిందితులంతా ముందుగా అనుకున్న తర్వాతే ఈ చర్యకు పాల్పడ్డారు.


ఈ కేసులో నిందితులైన సాదుద్దీన్ మినహా మిగతా ఐదుగురు మైనర్లంతా హైదరాబాద్ శివారులోని విద్యా సంస్థల్లో చదువుతున్నారు. వీరందరికీ ఓ కామన్ ఫ్రెండ్ ఉన్నాడు. అతని ద్వారానే వీరంతా తరచూ పబ్‌లకు వెళ్తున్నారు. నిబంధనల ప్రకారం పోక్సో కేసులో 60 రోజుల్లో నిందితులపై చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చార్జిషీట్‌లో పొందుపరచాల్సిన అంశాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. నేటితో (జూన్ 14) మైనర్ నిందితుల కస్టడీ ముగియనుంది. పోలీసులు మరోసారి వీరిని కస్టడీకి కోరుతారా లేక ఇప్పటికే పూర్తి వివరాలు రాబట్టారా అన్నది చూడాలి.


Also Read: Strawberry Moon: ఇవాళ ఆకాశంలో అద్భుత దృశ్యం.. 'స్ట్రాబెర్రీ మూన్‌'గా చంద్రుడు.. ఏ సమయంలో కనిపిస్తుందో తెలుసా


Also Read: Rainfall in Telangana: హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. ఏయే ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదైందంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.